Breaking News

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

-ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు..

గన్నవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం 1:35 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ నినాల జయసూర్య, జస్టిస్ మహేశ్వరరావు కుంచెయం, జస్టిస్ టీసీడీ శేఖర్ విమానాశ్రయమునకు చేరుకోగా వారికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులతో పాటు కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, విమానాశ్రయం డైరెక్టర్ ఎం ఎల్ కే రెడ్డి, టెర్మినల్ ఇన్చార్జి అంకిత్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, విమానాశ్రయం సిఎస్ఓ కె ధర్మేంద్ర తదితరులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమరావతికి బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *