Breaking News

సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, మంగళవారం (హోళీ) శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని, బకాయిదార్లు పన్నుకు సంబదించి ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మంగళవారం హోలీ పండగ సెలవు రోజైనప్పటికీ జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో నగర పాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను చెల్లించవచ్చన్నారు. అలాగే పన్ను బకాయిలపై మార్చి 1న బకాయిదారుల ఫోన్లకు మెసేజ్ లు కూడా పంపామని, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కాల్ సెంటర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *