Breaking News

పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారం పట్ల అధికారులు ప్రత్యేక ద్రుష్టి సారించాలన్నారు. సచివాలయం పరిధిలోనే పరిష్కారం చేసే అంశాలపై ఎవరైనా పిజిఆర్ఎస్ కి ఫిర్యాదులు అందిస్తే సంబందిత కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అర్జీని నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని, జీరో బియాండ్ ఎస్ఎల్ఏ నిర్వహించాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాధిపతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం త్రాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి రోజు త్రాగునీటి సరఫరా సమయంలో ఒక్కో ఎమినిటి కార్యదర్శి 10 శ్యాంపిల్స్ తీసి రిజిస్టర్ లో నమోదు చేయలన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా 46 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 20, రెవెన్యూ విభాగం 5, ప్రజారోగ్య విభాగం 7, అకౌంట్స్ విభాగం 1 ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, జి.సాంబశివరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *