-ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా థర్డ్ వేవ్ ను నియంత్రించగలం…
-గ్రామ, వార్డు, పీహెచ్ సీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాం…
-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పై శనివారం జిల్లా కలెక్టరు జె.నివాస్ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు గుడివాడ ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్డీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్డీవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొన్నారని, అందులో కొంత మంది స్వంతగా ఇళ్లు నిర్మించుకోగా మరి కొందరు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి రుణం పొందారన్నారు. వీరందరికీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా మండలస్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది లబ్దిదారులుకు అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకం అమల్లో నిర్ధేశించిన మార్గదర్శకాలను, సర్వే వివరాలు డేటా ఎంట్రీ, లబ్దిదారుల నుంచి సొమ్ము జమ చేయించడం తదితర అంశాలపై కలెక్టర్ జె. నివాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారన్నారు. డివిజన్ పరిధిలో సర్వే ద్వారా లబ్దిదారులను గుర్తించి వారి వివరాల డేటాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారన్నారు. డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా ఇంటి రిజిస్ట్రేషన్ కోసం లబ్దిదారులకు డిమాండ్ జనరేట్ చేసి నిర్ధేశించిన నామ మాత్రపు ఫీజును వసూలు చేసే ప్రక్రియ చేపట్టాలని కలెక్టరు ఆదేశించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో మినహాయించి ఈ నెల 10 వ తేదీ నుంచి లబ్దిదారులకు ప్రభుత్వం నిర్థేశించిన నామిమాత్రపు రుసుమును వసూలు చేసే ప్రక్రియను అన్ని మండలాల్లోను, పట్టణాల్లోను చేపట్టాలని కలెక్టరు ఆదేశించారని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ తెలిపారు. మున్సిపల్ మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులను గుర్తించి ఓటీఎస్ పథకం యొక్క ప్రయోజనాలను వివరించి అవగాహన కల్పించాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో, పిహెచ్ సీల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాం..
గుడివాడ డివిజన్ పరిదిలో శుక్రవారం 2 కోవిడ్ పోజటికేసులు నమోదయాని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు. కోవిడ్ పోయిందిలే అని ఏ ఒక్కఅజాగ్రత్తగా ఉండవద్దని, కోవిడ్ నియంత్రణ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 18 ఏళ్ళు వయస్సు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి గ్రామ, వార్డు సచివాలయంల్లోను, పిహెచ్ సీల్లోను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించకోవడం ద్వారా థర్డ్ వేవ్ రాకుండా నియంత్రించగలమన్నారు. కోవిడ్ కట్టడే లక్ష్యంగా షాఫులు, వాహనాలు, వ్యాపార వాణిజ్య సంస్థంలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నోమాస్క్ నో రైడింగ్”, “నోమాస్క్ నో సేల్” బోర్డులను ప్రదర్శిస్తూ వినియోగదారులుకు అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, హౌసింగ్ డీఈ రామోజీనాయక్, పామర్రు, గుడ్లవల్లేరు తాహశీల్ధార్లు సురేష్ బాబు, ఆంజనేయులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News