Breaking News

అభివృద్ధి లో అగ్రగమిగా తూర్పు నియోజకవర్గం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఆ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో పర్యటించిన ఆయన జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పప్పుల మిల్లు రోడ్డు, రఘు గార్డెన్ రోడ్డు అవసరం గురుంచి వారు అవినాష్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే కమిషనర్, మేయర్ లతో ఫోన్ లో మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణల గురుంచి వివరించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత డివిజన్ అయిన సరే టీడీపీ అధికారంలో వున్నప్పుడు అభివృద్ధి కి నోచుకోలేదు అని,కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 4కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం గాని,సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వం దే అని అన్నారు.

తోపుడు బండి వితరణ…
విజయవాడ నగరంలో సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా నిరుపేదల జీవనోపాధి కొరకు అండగా నిలుస్తున్న యలమంచిలి జయ సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.సోమవారం 12వ డివిజిన్ కి చెందిన లంక అలివేలు కి వైయన్ఆర్ చారిటీస్ ద్వారా 20వేల రూపాయల విలువ చేసే తోపుడు బండిని జీవనోపాధి నిమిత్తం అవినాష్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్, వైసీపీ సీనియర్ నాయుకులు మహమ్మద్ రిజ్వాన్, ధనేకుల రామ కాళేశ్వర రావు, రామాయణపు శ్రీనివాస్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, ఉకోటి రమేష్,శెటికం దుర్గాప్రసాద్, జక్కా శ్రీనివాస్, కంచర్ల సుగుణేశ్వర రావు,అబ్దుల్ రహీం, షేక్ బషీర్, నాగశేషు, రాజాబాబు, అరిగెల నాగరాజు, కోలా ఉమ, చిమాట బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *