Breaking News

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ఘన స్వాగతం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రమణ్యం తదితరులు చిరాగ్ పాశ్వాన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కేంద్ర మంత్రికి వారు ప్రజాప్రతినిధులు, అధికారుల తరఫున ఆత్మీయంగా స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *