గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మేరకు రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపెద్ది బోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కొలుసు మోహన్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల రామకృష్ణ యాదవ్, తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఏపీ బీసీ డెడికేషన్ కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ వినతి పత్రం అందచేశారు.
వినతి పత్రంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ డి ఎస్.నెం :33 లో ఉన్న శ్రీకాకుళం విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, పల్నాడు, మార్కాపురం, సత్యసాయి , బాపట్ల చిత్తూరు జిల్లాల లోని యాదవులు సామాజికంగా, రాజకీయంగా. ఆర్థికంగా, విద్యాపరంగా, వస్త్రధారణలో అత్యంత వెనుకబడి ఉన్నారు. ఈ జిల్లాల్లో యాదవుల విద్యార్థుల్లో పదవ తరగతి లోనే డ్రాప్ శాతం ఎక్కువగా ఉన్నది. కావున ఈ జిల్లాలోని యాదవులను బీసీ డీ గ్రూప్ నుంచి తొలగించి బీసీ (ఏ) గ్రూపులోకి మార్చాలని దీనికై తమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంకు సిఫార్సు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలు కల్పిస్తున్నటువంటి 34% రిజర్వేషన్లను 44% పెంచే విధంగా తమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలన్నారు. ఏపీ రాష్ట్రంలోని బీసీల విద్య, ఉపాధి రిజర్వేషన్లను 25% నుంచి 44 శాతానికి పెంచాలన్నారు. ఏపీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవులకు జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా తమ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నామన్నారు. ఏపీలో 2027 జనాభా లెక్కలు సేకరించిన తర్వాతే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నామన్నారు. గొర్రెల కాపరులుగా, పాడి పశువుల జీవనాధారంగా ఉన్న, కొండ ప్రాంతాలలో పశుగ్రాసం పై ఆధారపడి జీవిస్తున్న యాదవులను ఎస్ ఎన్ టి, డి ఎన్ టి, గ్రూప్ లో చేర్చేందుకు తమ కమిషన్ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి తగు నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షులు అనంతరామయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవుల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా కమీషన్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News