Breaking News

“తరగతి గది రేపటి భారతాన్ని తీర్చిదిద్దే గర్భగుడి”

-“విద్యార్థుల విద్య–ఆరోగ్యాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!”
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“అమ్మ ఒడి మానవ జననానికి గర్భగుడైతే తరగతి గది మానవ గమనానికి గర్భగుడి” అంటూ విద్యా వ్యవస్థ ప్రాముఖ్యతను విశదీకరించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని), విద్యార్థుల విద్యా వికాసం మరియు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని, అక్కడ అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించడమే కాకుండా, వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యా పరిస్థితులు, ఆరోగ్య అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.విద్యార్థుల చిరునవ్వే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట అనీ వారి విద్య, ఆరోగ్యాల పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం అని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చిన్నారుల మధ్య నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను నిర్వహించి కేకు ను కట్ చేసి మిఠాయిలు పంచారు.
ఈ ఆకస్మిక సందర్శన సందర్భంగా మాట్లాడిన ఎంపీ కేశినేని చిన్ని, “నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాణ శిల్పులు అనీ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై, వారి భవిష్యత్తును బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని అన్నారు.
విద్యార్థి ప్రగతికి మంచి విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా అత్యవసరమని పేర్కొన్న ఆయన, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఏకాగ్రత, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వం అంగన్వాడీ నుంచి పాఠశాల స్థాయి వరకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా సమగ్ర కార్యాచరణ చేపట్టిందన్నారు.
పాఠశాలలలో పరిశుభ్రత, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సూచించిన ఎంపీ, పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
“విద్య, ఆరోగ్యం, పోషకాహారం అనే మూడు స్థంభాలపైనే విద్యార్థి భవిష్యత్తు నిర్మితమవుతుందన్నారు. ఈ మూడు రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం” అని కేశినేని శివనాధ్ (చిన్ని) పేర్కొన్నారు.
విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ,వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్,శాప్ డైరెక్టర్ సంతోష్,స్టేట్ కార్యదర్శి షేక్ ఆషా,మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫతుల్లాహ్, జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణ్ రావు,జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీను,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మైలపల్లి రాజు,పశ్చిమ తెలుగు మహిళా అధ్యక్షరాలు షేక్ నసీమ,మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండీ ఆన్సర్, టీ ఎన్ స్ ఎఫ్ ప్రెసిడెంట్ మోడీ రాజు ఫైజాన్ క్లస్టర్ సయ్యద్ కరిముల్లాహ్ విజన్ ప్రెసిడెంట్లు ఈగల సాంబ, కుంచం దుర్గారావు,ఎండీ జాహిద్,మహిళా నాయకులు పుప్పాల దుర్గ,భార్గవి,శాంతి తదితరులు పాల్గొన్నారు.
50వ డివిజన్ అధ్యక్షులు కొప్పుల అరుణశ్రీ, డివిజన్ ప్రధాన కార్యదర్శి,
కాళ్ళ ఈశ్వరరావు యాట్ల ప్రసాద్,
మైలపల్లి రాజు గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీర్ల వాసు ,బూత్ కన్వీనర్
పీత బుజ్జి ,పెంటపల్లి బాజీ ,షేక్ మోబినా దాడి మురళి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *