-శాశ్వత సమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎంపీ చిన్ని
-వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం ఎంపీ నిధులతో నేడు మోటార్ పంపు పనులు పునరుద్ధరణ కార్యక్రమం
-33 లక్షల ఎంపీ నిధులతో నేడు పనులకు శ్రీకారం
-వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చిన గత ప్రభుత్వం
-వేదాద్రి కంచల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే సౌమ్య ఎమ్మెల్యే తాతయ్య
-సీఎం చంద్రబాబు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను పలుమార్లు కలిసి పనుల కార్యాచరణను అమల్లోకి తీసుకువచ్చిన ఎంపీ చిన్ని
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం నిర్మించబడిన సంగతి అందరికీ తెలిసిందే కొన్నాళ్లపాటు 4 పంపు సెట్లు బాగానే పని చేసిన కాలక్రమేణా సమస్యలు రావడం వలన అనేక పర్యాయాలు మర్మతులు చేయడం జరిగింది. అయితే గత వైసిపి హయాంలో పూర్తిగా ఈ పథకం మరుగున పడింది గత ఐదు సంవత్సరాలలో వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకున్న వారే లేరు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని చొరవ తో పనులు మరమ్మత్తులకు స్వయంగా ఎంపీ నిధులతోనే శ్రీకారం చుట్టారు 33 లక్షల ఎంపీ నిధులతో నేడు పనుల పునరుద్దరణ చేపట్టారు ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి ప్రారంభించారు.ఈ నిధులను ఉపయోగించి 3వ నంబర్ పంపు ను పని చేసే స్థితి లోనికి తీసుకురానున్నారు.
ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నందిగామ జగ్గయ్యపేట ప్రాంత రైతులంతా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని పర్యాయాలు గత నాయకులు అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని వద్దకు రైతులు వచ్చి అభ్యర్థించిన మేరకు వెంటనే ఎంపీ నిధుల నుంచి పనుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు ఈ పథకం ద్వారా సుమారుగా 17 వేల ఎకరాలకు పైగా ఉన్న ఆయకట్టుకు నీరు అందుతుంది దీనితో రైతులకు ఎంతగానో మేలు చేకూర్చి లాభదాయకంగా ఈ పథకం మారుతుంది. 2014 19 టిడిపి ప్రభుత్వంలో వేదాద్రి కంచల లిఫ్ట్ స్కీం నిర్వహణ కోసం 5.36 కోట్లు ఖర్చు చేసి సాగునీరు అందించినట్లు ఎంపీ తెలియజేశారు. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా చేస్తామని తెలియజేశారు.వేదాద్రి కంచల స్కీం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది దేవినేని వెంకటరమణ మరియు దేవినేని ఉమామహేశ్వరరావు అని ఎంపీ చిన్ని తెలియజేశారు రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు త్వరలో నందిగామలో ఆయుష్ హాస్పిటల్ కు సైతం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు అనేక పరిశ్రమలు జగ్గయ్యపేట నందిగామ పరిధిలో రానున్నట్లు ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. పోలంపల్లి ప్రాజెక్టు పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వేదాద్రి కంచల స్కీంకు 15 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఎంపీ చిన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోటా వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు ఐడీసీ ఎండీ తిరుమలరావు మరియు అన్ని నీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News