Breaking News

81,417 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,46,937 ఫారాలను (97.97 శాతం) పంపిణీ చేసి, అందులో 84,425 ఫారాలను డిజిటలైజ్ చేశామని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,75,050 ఫారాలను (98.74 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 81,417 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *