Breaking News

గ్రామ సచివాలయాలతో మెరుగైన సేవలు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని వాడపాలెం గ్రామ సచివాలయాన్ని మంత్రి పేర్ని (నాని) శనివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభించారు. రూ.40లక్షల ఎంజిఎన్ఆర్ఈజీఎ్స నిధులత ఆధునిక వసతులతో నిర్మించిన ఈ సచివాలయంను ప్రారంభించిన తర్వాత మెడిశెట్టివారి దేవర అమ్మవారి గుడి వద్ద జరిగిన గ్రామసభలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి అవినీతిరహితమైన పారదర్శక పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం గ్రామస్తులు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసి లంకె వెంకటేశ్వరరావు( ఎల్వీయార్), వాడపాలెం సర్పంచ్ మేడిశెట్టి రాజ్ కుమార్, డ్వామా పి డీ , మచిలీపట్నం ఎంపీడీఓ జి. సూర్యనారాయణ, బ్యాంక్ అధ్యక్షులు మేడిశెట్టి వేణుగోపాల్ ప్రసాద్, కె పి టి పాలెం సర్పంచ్ రేమాని చంద్రవంక తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *