శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం

– అబద్దాలు, అసత్య ప్రచారాలతో జగన్ ఫేక్ డ్రామాలు
– ఏపీపీఎస్సీ పేపర్లను ప్లంబర్లు, ఎలక్ట్రీషిన్లతో దిద్దించిన జగన్ సిగ్గుపడాలి
– మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం
– మంత్రి కొలుసు పార్థసారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు ఈరోజు విజయవాడలోని శాప్ కార్యాలయంపై వైసీపీ సైకోలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…….ఎన్నికల హామీల్లో భాగంగా 16,500టీచర్ పోస్టులను తొలిసంతకం ద్వారా ఇస్తే దాని గురించి జగన్ మర్చిపోయాడు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 3శాతం ఉద్యోగాలు క్రీడాకారులకు ఇస్తే దానిపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాడు. ఈరోజు విజయవాడ శాప్ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేయించి అల్లర్లు సృష్టించడానికి జగన్ ప్రయత్నించాడు. వైసీపీ అధికారంలో ఉండగా ఏపీపీఎస్సీ పేపర్లను ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో దిద్దారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరచిపోయారా? పోలీసులు, సంబంధిత అధికారులు లేకుండా ఏపీపీఎస్సీ పేపర్లు దిద్దడంపై కోర్టులు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. దానికి సిగ్గుపడకుండా ఉద్దేశపూర్వకంగా మెగా డీఎస్సీపై బురదజిమ్ముతున్నాడు. సొంత ఛానల్, పత్రికలు ఉన్నాయని గంటల తరబడి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? జగన్ తన పాలనలో చేసిన దుర్మార్గాలు బయటపడతాయనే భయంతో అసెంబ్లీకి రావడం లేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాములో రూ.3,200కోట్లు దోచేసినట్లు సిట్ నివేదికలో తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయాల్లో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వక విమర్శలు, దాడులు చేస్తున్నాడని మంత్రి కొలుసు పార్థసారధి గారు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *