సోషల్ మీడియా రంగ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
MOU మార్పిడి కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖా ముఖి నిర్వహించి సోషల్ మీడియా రంగ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. అనంతరం సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీని అభివృద్ధి చేయడంతో పాటు సోషల్ మీడియా రంగంలోని ప్రతిభను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానం చేసేలా భవిష్యత్‌లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటుతో పాటు, సోషల్ మీడియా రంగంలో ఉన్న యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం యూట్యూబ్ అకాడమీ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లను ఒక నెట్‌వర్క్‌గా అనుసంధానం చేయడం వంటి చర్యలపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత, ఊహాశక్తి, ప్రతిభను వ్యక్తిగతంగా, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తే సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల్లో పనిచేస్తున్న వారు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

“మీరు ఇమాజినేషన్ చేస్తారు.. నేను ఆచరణలో పెడతాను.. ఈ రెండూ కలిస్తే స్కై ఈజ్ ద లిమిట్” అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిస్రప్టివ్ థింకింగ్, డిస్రప్టివ్ టెక్నాలజీ, డిస్రప్టివ్ పాలసీలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *