Breaking News

ఉమాపతి సేవాసమితి ఆధ్వర్యంలో గణేశుడికి ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్, పూలబావి సందులో ఉమాపతి సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గణేషుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తున్న ఉమాపతి సేవాసమితి నిర్వాహకులను ఆయన అభినందించారు. కమిటీ సభ్యులు సంపత్, కాజా రమేష్, మద్ది కుమార్ , పేరూరు సతీష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *