Breaking News

ఘనంగా శ్రీ బాలగణపతి స్వామివారి 41 వ నవరాత్రి ఉత్సవాలు..

-ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్ లోని శ్రీ బాల గణపతి స్వామివారి సన్నిధిలో వినాయక చవితి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ చవితి ఉత్సవాల్లో పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాల్లో గణపతికి పంచ హారతులు ఇస్తూ కోలాటాల నృత్యాలు ప్రదర్శించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లి విరిసింది. శ్రీ బాలగణపతి స్వామి ఆలయ అధ్యక్షులు గ్రంధి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మామిడి లక్ష్మి వెంకట కృష్ణారావు, కోశాధికారి మండేపూడి వేణుగోపాలరావు, ఉత్సవ కమిటీ సభ్యులు రాయుడు శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *