Breaking News

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు
-బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి
-22 ఏ నిషేధిత భూముల జాబితాను తొలగించే ఏర్పాట్లు
-అగ్రిగోల్డ్ పై స్టేట్ లెవెల్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం కల్పించేలా, వెనువెంటనే మంత్రుల సబ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వారంలో రెండోసారి అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. ఈసారి అన్ని శాఖలను సమన్వయంతో స్టేట్ లెవెల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు వీలైన దారులను వెతుకుతున్నామని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, అగ్రిగోల్డ్ పై ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. బుధవారం సచివాలయంలో అగ్రిగోల్డ్ పై మంత్రుల సబ్ కమిటీతో స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. సీసీఎల్ఏ తో పాటు పోలీస్, మున్సిపల్, అటవీ, స్టాంప్లు రిజిస్ట్రేషన్లు శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని సమీక్ష చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మనోహర్  మాట్లాడుతూ.. ” అగ్రిగోల్డ్ లో పెట్టుబడి పెట్టి బాండ్స్ ఉన్న వారు వారి ఒరిజినల్ ను చూపించి జిరాక్స్ ను ప్రత్యేక బృందాలకు ఇవ్వాలి. వాటిని ప్రత్యేక బృందాలు అటెస్ట్ చేస్తాయి. మొత్తం 20 ప్రత్యేక బృందాలను దీనికోసం నియమించాం. ఆంధ్రప్రదేశ్లో 7 తెలంగాణలో 3 తో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో 10 బృందాలు ఈ బాండ్ల సేకరణకు రెండు, మూడు రోజుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయి. అగ్రిగోల్డ్ బాధితులు బాండ్ల జిరాక్స్ లు ఇచ్చి ప్రభుత్వానికి తగువిధంగా సహకరించాలి.

** అగ్రిగోల్డ్ గతంలో సేకరించిన భూముల్లో గతంలో ప్లాంటేషన్ జరిగింది. రకరకాల మొక్కలను వేశారు. దీనిపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, ప్లాంటేషన్ మొత్తాన్ని ఆడిట్ చేయనున్నారు. అక్కడున్న వృక్ష సంపద అసలు విలువను లెక్క కడతారు. దీంతోపాటు అగ్రిగోల్డ్ మున్సిపల్ ఏరియాల్లో వేసిన లే అవుట్ల పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

** అగ్రిగోల్డ్ ప్లాట్లను కొని, రిజిస్ట్రేషన్ చేసుకున్న బోనోఫైడ్ ( ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్లు పూర్తయిన వారు ) లబ్ధిదారులకు మొదటి దశలో పూర్తిగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ భూములు 22 ఏ లో ఉన్నాయి. వాటిని నిషేధిత భూములు నుంచి తొలగించి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసేలా జిల్లాల కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాం. మొత్తం 42,531మంది పాట్ల లబ్ధిదారుల్లో 35,544 మంది బోనోఫైడ్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించాం. 6,989 మంది డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించారు గాని రిజిస్ట్రేషన్లు జరగలేదు. వారికి రెండో విడతలో న్యాయం జరిగేలా చూస్తాం.

“ఇక మీద అగ్రిగోల్డ్ మీద సబ్ కమిటీ సమావేశాలు వేగవంతంగా ఉంటాయి. కమిటీ సమావేశాల్లో తీసుకుని నిర్ణయాలు వేగంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం. అగ్రిగోల్డ్ విషయంలో నష్టపోయిన ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం” అన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శభాష్ సాయి…

-బాల్ బ్యాడ్మింటన్ రాణిస్తున్నబీసీ విద్యార్థి సాయికుమార్ -మంత్రి సవిత అభినందనలు తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *