Breaking News

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన 1394 వ (57వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఊతం – రూ.22,177 కోట్ల పెట్టుబడులు, 19,739 ఉద్యోగాలు… (1 నుండి 10 మరియు 15)

నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫారసుల మేరకు వివిధ రంగాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మొత్తం రూ.22,177.84 కోట్ల పెట్టుబడులు, 19,739 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమలు కానున్నాయి.

మౌలిక వసతులు–పెట్టుబడుల రంగంలో రూ.8,000 కోట్లు, 3,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో షిప్‌యార్డ్ ఏర్పాటుకు కీలక అనుమతి లభించింది. ఇది రాష్ట్ర సముద్ర మౌలిక వసతులు, నౌకా నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయనుంది.

ఇంధన రంగంలో రూ.5,176.56 కోట్లు, 2,240 ఉద్యోగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 675 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో సోలార్–విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, నంద్యాల జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి. ఇవి రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచనున్నాయి.

పరిశ్రమలు–వాణిజ్య రంగంలో రూ.4,332.49 కోట్లు, 4,885 ఉద్యోగాలకు ఆమోదం లభించింది. పల్నాడు జిల్లాలో మై హోమ్ ఇండస్ట్రీస్ రూ.3,000 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు, కుప్పంలో MAF Clothing ప్రాజెక్టుతో పాటు Fortune 500 సంస్థ Caterpillar రూ.100 కోట్ల ప్రారంభ పెట్టుబడితో రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. Agarwal Foundries, Dalmia Cement తదితర సంస్థల విస్తరణ ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.

ఆహార శుద్ధి రంగంలో రూ.3,734.18 కోట్లు, 2,113 ఉద్యోగాలు, ఐటీ–ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.526.25 కోట్లు, 5,736 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. విశాఖపట్నంలో Deloitte IT/ITES క్యాంపస్, Muthoot Fincorp AI–Tech Training Centreతో పాటు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ప్రాజెక్టులకు అనుమతి లభించింది.

పర్యాటక రంగంలో రూ.408.26 కోట్లు, 1,765 ఉద్యోగాలకు సంబంధించిన హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తిరుపతి, అమరావతి, కడపలో కొత్త హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుతో రాష్ట్ర పర్యాటక మౌలిక వసతులు మరింత విస్తరించనున్నాయి. మొత్తంగా ఈ పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, సాంకేతిక ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధనం, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి.

1. పరిశ్రమలు & వాణిజ్యం:
పాల్నాడు జిల్లా దాచేపల్లి (M), గమలపాడు (V)లో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ తయారీ కర్మాగారం స్థాపన కోసం M/s మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

2. పరిశ్రమలు & వాణిజ్యం:
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యం స్థాపన కోసం Caterpillar India Private Limited (CIPL)కు AP ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ (4.0) 2024-2029 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

3. పరిశ్రమలు & వాణిజ్యం:
చిత్తూరు జిల్లా కుప్పం, పలార్లపల్లెలో 24 ఎకరాల స్థలంలో గార్మెంట్ తయారీ ప్లాంట్ స్థాపన కోసం M/s MAF క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు AP టెక్స్టైల్, అప్పారెల్ అండ్ గార్మెంట్స్ పాలసీ (4.0) 2024-2029 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

4. పరిశ్రమలు & వాణిజ్యం:
YSR కడప జిల్లా మైలవరం (M), చిన్నకొమ్మెర్ల (V)లో ఇప్పటికే ఉన్న క్లింకర్ మరియు సిమెంట్ ప్లాంట్‌ను విస్తరించి 9.60 MTPA ఉత్పత్తి సామర్థ్యం సాధించడానికి M/s దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్‌కు LA for Others పాలసీ కింద 250 ఎకరాల భూమి కేటాయించడానికి మరియు జి.ఓ.ఎంఎస్.నం.40, I&C (P&I) శాఖ, తేదీ:25.3.2025ని సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

5. పరిశ్రమలు & వాణిజ్యం:
తిరుపతి జిల్లా పెళ్ళాకూరు (M), పెన్నేపల్లి (V)లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం M/s అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 148.98 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

6. పరిశ్రమలు & వాణిజ్యం:
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో హోమ్ అప్లయన్సెస్ & కన్స్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కోసం M/s LG ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జి.ఓ.ఎంఎస్.నం.77, I&C శాఖ, తేదీ:26.11.2024 ద్వారా మంజూరైన ప్రాజెక్ట్ అమలు గడువులు మరియు ప్రోత్సాహక వ్యవధి సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

7. పరిశ్రమలు & వాణిజ్యం:
జి.ఓ.ఎంఎస్.నం.157 మరియు జి.ఓ.ఎంఎస్.నం.158, తేదీ: 28.06.2026లో పేర్కొన్న అమలు సంస్థ పేరును “Premier Energies Limited” నుండి *“Premier Energies Global Environment Pvt. Ltd.”*గా మార్చేందుకు, M/s. Premier Energies Limited చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

8. పరిశ్రమలు & వాణిజ్యం (ఆహార ప్రాసెసింగ్):
కాకినాడ జిల్లాలో పార్‌బాయిల్డ్ రైస్ మిల్ మరియు ఫోర్టిఫైడ్ రైస్ (FRK) ప్రాజెక్ట్ స్థాపన కోసం M/s పట్టాభి అగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

9. పరిశ్రమలు & వాణిజ్యం:
విశాఖపట్నం జిల్లా గాజువాకలోని పరవాడ ఇండస్ట్రియల్ పార్కులో 3.6 GWp TOPCon సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు M/s. Akshat Greentech Pvt. Ltd.కు AP Industrial Development Policy (4.0) 2024–2029 కింద జి.ఓ.ఎంఎస్.నం.215 (I&C), తేదీ: 20.08.2026 ద్వారా మంజూరైన Tailor-made Incentives సవరణకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

10. పరిశ్రమలు & వాణిజ్యం:
REPM పథకం కింద కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ఖరారు చేసిన తేదీ నుంచి M/s. N.A.N MagneTech Pvt. Ltd. మరియు M/s. Proterial (India) Ltd. సంస్థలు చెల్లించాల్సిన EMD, ప్రాసెసింగ్ ఫీజు, భూమి వ్యయం చెల్లింపులకు వడ్డీ రహిత గడువును 30 రోజుల వరకు పొడిగించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

11. పరిశ్రమలు & వాణిజ్యం:
జీఎస్టీ అమలులోకి వచ్చిన అనంతరం వివిధ పారిశ్రామిక, రంగాలవారీ విధానాల కింద అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, పెద్ద మరియు మెగా పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న SGST రీయింబర్సుమెంట్ క్లెయిమ్‌లను పారదర్శకమైన, ఆన్‌లైన్ విధానంలో, మానవ ప్రమేయం లేకుండా పరిష్కరించేందుకు ప్రతిపాదించిన విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం G.O.Ms.No.109, I&C (P&I) శాఖ, తేదీ: 21.08.2017 ద్వారా ఏర్పాటు చేసిన బహుళశాఖల కమిటీ సిఫార్సుల మేరకు అమలు చేయబడుతుంది.

12. పరిశ్రమలు & వాణిజ్యం:
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC)కు Sagarmala Finance Corporation Limited (SMFCL) మంజూరు చేసిన ₹2,500 కోట్ల టర్మ్ లోన్ను వినియోగించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రుణాన్ని మూలపేట, రామాయపట్నం, నాయుడుపేట, దుర్గరాజపట్నం పారిశ్రామిక క్లస్టర్లతో పాటు బురుగుపాలెంలోని Critical Mineral Processing Park కోసం భూసేకరణ, బాహ్య మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు.

13. పరిశ్రమలు & వాణిజ్యం:
Bharat Audyogik Vikas Yojana (BHAVYA) కింద జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ (NLSC) ఎంపిక చేసే పారిశ్రామిక పార్కుల అమలుకు సంబంధించి, రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా APIICకు NICDITతో ఉన్న Shareholders Agreement (SHA), State Support Agreement (SSA) లకు అనుబంధ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న SPVల ద్వారా ప్రాజెక్టుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే, ఎంపికైన BHAVYA పార్కులను IALAలుగా నోటిఫై చేసి, లేఅవుట్లు, బిల్డింగ్ ప్లాన్‌లకు అనుమతులు జారీ చేసే అధికారాలను APIICకు అప్పగించడంతో పాటు, ప్రతిపాదిత BHAVYA పార్కులకు సంబంధించిన ప్రభుత్వ భూములు, DKT భూముల కేటాయింపుకు కు ఉత్తర్వులు జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది.

14. పరిశ్రమలు & వాణిజ్యం:
సహకార చక్కెర కర్మాగారాల ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి మంత్రుల బృందం (GoM) చేసిన సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్, గోవాడకు చెరకు ధర బకాయిల చెల్లింపుల కోసం రుణ రూపంలో ఆర్థిక సహాయం అందించడం, పనిచేయని 3 సహకార చక్కెర కర్మాగారాలను ఉద్యోగులకు VRS కల్పిస్తూ లిక్విడేషన్ చేయడం, జాయింట్ కలెక్టర్లను లిక్విడేటర్లుగా నియమించడం, అలాగే 5 సహకార చక్కెర కర్మాగారాల పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల VRS ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల కోసం APIIC నుంచి ₹66.57 కోట్ల రుణం పొందడం తదితర చర్యలు ఉన్నాయి. అదనంగా, నష్టాల్లో ఉన్న 8 సహకార చక్కెర కర్మాగారాల బకాయిల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి ఆమోదం లభించింది.

15. పరిశ్రమలు & వాణిజ్యం:
ఆహార శుద్ధి, పానీయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల రంగాల్లో పలు పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో SPSR నెల్లూరు జిల్లాలో M/s. Sri Vaibhava Lakshmi Enterprises Pvt. Ltd. ద్వారా ఎగ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫీడ్ మిల్, లేయర్, బ్రాయిలర్ ఫారాలు, పుల్లెట్ హౌస్ తదితర యూనిట్ల ఏర్పాటు, M/s. EPITOME Industries India Ltd. ద్వారా ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ, బేకరీ ఫ్యాట్స్, స్పెషాలిటీ ఫ్యాట్స్, కోకో బటర్ సబ్‌స్టిట్యూట్ తయారీ యూనిట్ ఏర్పాటు ఉన్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో M/s. Sree Vasudha Foods India Pvt. Ltd. ద్వారా చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, చిత్తూరు జిల్లాలో M/s. Ravox Agritech India Pvt. Ltd. ద్వారా మల్టీ-కమోడిటీ ప్రాసెసింగ్ యూనిట్లతో సమగ్ర ఫుడ్ పార్క్ ఏర్పాటు, తిరుపతి జిల్లా శ్రీ సిటీలో M/s. Kellogg’s India Pvt. Ltd. ఇప్పటికే ఉన్న మ్యూస్లీ/మల్టీగ్రెయిన్ చోకోస్ ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణ, విజయనగరం జిల్లాలో M/s. Hindustan Coca-Cola Beverages Pvt. Ltd. ద్వారా పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటు, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఇప్పటికే ఉన్న పానీయాల తయారీ యూనిట్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

16. జలవనరుల అభివృద్ది:
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు – ఫేజ్-II కింద పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ (Km.0.000 నుంచి Km.66.950 వరకు)కు CC లైనింగ్ ఏర్పాటు చేసే పనులకు ₹125.65 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

17. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి రాజధాని నగర పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో Critical Infrastructure and Investment Plan (CIIP) కింద మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ₹1,548.98 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అమరావతి రాజధాని నగరంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో Critical Infrastructure and Investment Plan (CIIP) కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం గతంలో మంజూరైన రూ.904 కోట్లకు బదులుగా రూ.1,548.98 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి ఇవ్వడం జరిగింది.

పనుల పరిధిలో నీటి సరఫరా 76.02 కి.మీ., సీవరేజ్ 30.16 కి.మీ., స్టార్మ్ వాటర్ నెట్‌వర్క్ 309.30 కి.మీ., రహదారులు 69.68 కి.మీ. మేర పెంచడంతో పాటు 2,597 స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సవరించిన Schedule of Rates (SOR) ప్రకారం రేట్లను సర్దుబాటు చేయనున్నారు.

అమలు విధానంలో LPS Zone-wise స్థానంలో Package-wise executionను, 7 సంవత్సరాల Operation & Maintenance స్థానంలో 2 సంవత్సరాల Defect Liability Periodను అమలు చేయనున్నారు. EPC విధానానికి బదులుగా Lump Sum (Percentage) Contract Systemను స్వీకరించనున్నారు.

ఈ నిర్ణయాన్ని APCRDA అథారిటీ Resolution No.716/2026 ద్వారా ఆమోదించింది. టెండర్లను ఆహ్వానించి ఖరారు చేయడంతో పాటు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం ఇవ్వడం జరిగింది.

18. పురపాలక & పట్టణాభివృద్ధి:
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ & ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025లోని రూల్ 16(2), సంబంధిత ఫారమ్–Vలో సవరణలు చేసి, భూసమీకరణ పథకం కింద 1 ఎకరా కంటే తక్కువ పొడి, జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక భృతి (Annuity) చెల్లించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే, 02.12.2025 నాటికి యాజమాన్యం నిర్ధారితమైన 1,304 మంది అర్హత కలిగిన LPS భూయజమానులకు ఇప్పటికే చెల్లించిన ₹5.04 కోట్ల వార్షిక భృతిని ధృవీకరించడంతో పాటు, దానికి రాటిఫికేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.

19. పురపాలక & పట్టణాభివృద్ధి:
CRDA పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు, గతంలో జరిగిన భూ కేటాయింపుల సమీక్షపై 30వ మంత్రుల బృందం (Group of Ministers) చేసిన సిఫారసులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అమరావతి భూ కేటాయింపు నిబంధనలు, 2017 మరియు రెగ్యులేషన్లు, 2017 ప్రకారం అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు APCRDA కమిషనర్‌కు అనుమతి ఇవ్వడం జరిగింది.

20. పురపాలక & పట్టణాభివృద్ధి:
స్ట్రీట్ వెండర్స్ (Protection of Livelihood and Regulation of Street Vending) యాక్ట్, 2014లోని సెక్షన్ 20(1) కింద రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీలపై రాష్ట్రస్థాయి గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ ఏర్పాటు చేయడానికి మరియు AP స్ట్రీట్ వెండర్స్ రూల్స్, 2017లోని రూల్ 5 సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

21. పురపాలక & పట్టణాభివృద్ధి:
అమరావతి రాజధాని నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ ‘E’లో శాసనసభ భవనం పనులకు రూ.661.00 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అమరావతి రాజధాని ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ‘E’లో శాసనసభ భవన నిర్మాణానికి రూ.661 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. స్పైర్, రూఫ్, RCC నిర్మాణం, షీర్/కోర్ వాల్స్, స్లాబ్‌లు, బీమ్స్, లిఫ్ట్‌లు, వాటర్‌ప్రూఫింగ్ తదితర నిర్మాణ పనులు ఇందులో భాగంగా ఉన్నాయి.

గతంలో మంజూరైన రూ.798 కోట్ల పరిపాలనా అనుమతిని రద్దు చేసి, పనులను Design-Build Item Rate (Lumpsum) Contract విధానంలో చేపట్టనున్నారు. టెండర్లను ఆహ్వానించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు AGICL మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని APCRDA అథారిటీ Resolution No.715/2026 ద్వారా ఆమోదించింది.

22. పురపాలక & పట్టణాభివృద్ధి:
అమరావతి రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామంలోని స్కూల్ ప్లాట్–4లో 5 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన M/s. Nalanda Academy of Science and Technical Educationకు కేటాయించేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం కల్పించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 70:30 QCBS విధానంలో అత్యధిక స్కోరు సాధించిన H-1 బిడ్డర్గా ఈ సంస్థ ఎంపికైంది.

23. ఆర్థిక శాఖ:
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 01.07.2024 నుంచి 2.73% మరియు 01.01.2025 నుంచి 1.82% చొప్పున రెండు విడతల DA/DRలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన G.O.Ms.Nos.119, 120, 121 & 122, తేదీ: 11.09.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 01-07-2024 నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 50% నుంచి 53%కి, 01-01-2025 నుంచి 53% నుంచి 55%కి పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ సంఘం (11th PRC) సిఫారసుల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి 1% డీఏకు 0.910% కన్వర్షన్ ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రకారం 01-07-2024 నుంచి 3% కేంద్ర డీఏ పెంపునకు 2.73% డీఏ, అలాగే 01-01-2025 నుంచి 2% పెంపునకు 1.82% డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మంజూరవుతుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2026 జీతం నుంచి ఈ డీఏ/డీఆర్ పెంపు నగదు ప్రయోజనం అమల్లోకి వస్తుంది. 01-07-2024 నుంచి రావాల్సిన డీఏ బకాయిల్లో 10%ను ఏప్రిల్ 2027లో, మిగిలిన 90%ను జూన్, ఆగస్టు, అక్టోబర్ 2027లో మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.

అదేవిధంగా, 01-01-2025 నుంచి రావాల్సిన డీఏ బకాయిల్లో 10%ను జనవరి 2028లో, మిగిలిన 90%ను మార్చి, మే, జూలై 2028లో మూడు సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు.
ఈ డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే మొత్తం ఆర్థిక భారం సుమారు రూ.4,556 కోట్లుగా ఉంది.

24. రెవెన్యూ (ఎక్సైజ్):
2026–27 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణకు ఆబ్కారీ విధాన మార్గదర్శకాలను రూపొందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్, 2024లో చేసిన సవరణలకు సంబంధించిన G.O.Ms.Nos.579, 580, 581, 582 & 583, రెవెన్యూ (ఎక్సైజ్–II) శాఖ, తేదీ: 11.09.2026 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను రాటిఫై (ధృవీకరించేందుకు) మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

25. రెవెన్యూ:
శ్రీ సత్య సాయి జిల్లా చిల్మతూరు (M), తెకులోడు (V)లో Sy.No.16-1Bలో 623.60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం APIIC కు మార్కెట్ విలువ చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

26. రెవెన్యూ:
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం, బ్రహ్మసమేధ్యం గ్రామంలో సర్వే నం.84లో 1,234.00 ఎకరాలు, సర్వే నం.85లో 384.265 ఎకరాలు, మొత్తం 1,618.265 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC)కు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం నుంచి భీమునిపట్నం వరకు ప్రతిపాదిత బీచ్ శాండ్ మినరల్స్ (BSM) మైనింగ్ ప్రాజెక్టు కోసం అవసరమైన పరిహార వనీకరణ భూమి బ్యాంకు (Compensatory Afforestation Land Bank) ఏర్పాటు చేయడం ఈ కేటాయింపు ఉద్దేశ్యం.

27. రెవెన్యూ:
విజయనగరం జిల్లా, విజయనగరం మండలం, వేణుగోపాలపురం బిట్–II గ్రామంలోని సర్వే నం.5-3, 6-1లో మొత్తం 13.29 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA), విజయనగరానికి కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో మిల్లెట్ ప్రాసెసింగ్ సెంటర్, బయోగ్యాస్ ప్లాంట్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, నేచురల్ ఫార్మింగ్ డెమో ప్లాట్లు, స్వయం సహాయక సంఘాల (SHGs) శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

28. రెవెన్యూ:
YSR కడప జిల్లా ముద్దనూరు (M), పెద్దదుద్యాల (V)లో LPM.No.751 మొదలైనవాటిలో 7.20 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఆంప్లస్ IIFA సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం NREDCAP కు మార్కెట్ విలువ చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

29. రెవెన్యూ:
కృష్ణా జిల్లా మచిలీపట్నం సౌత్ మండలం, రుద్రవరం గ్రామంలో R.S.Nos.169/16, 172/2 తదితర సర్వే నంబర్లలో మొత్తం 102.85 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్ విలువ చెల్లింపు ప్రాతిపదికన కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్కు బదలాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని యూనివర్సిటీ భవనాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి వినియోగించనున్నారు.

30. రెవెన్యూ:
SPSR నెల్లూరు జిల్లా మూతుకూరు (M), ఏపురు బిట్-1A (V)లో LPM No.326, 327 మొదలైనవాటిలో (Sy.No.927) 11.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం ZM, APIIC నెల్లూరు (తిరుపతి స్పెషల్ ప్రాజెక్ట్స్ జోన్)కు చెల్లింపు ప్రాతిపదికన కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

31. రెవెన్యూ:
బాపట్ల మండలం & జిల్లాలో అడవి గ్రామంలో Sy.No.547-3A6Bలో 1.00 ఎకరం ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (APTA), విజయవాడకు చెల్లింపు ప్రాతిపదికన బదిలీ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

32. రెవెన్యూ:
YSR కడప జిల్లా మైలవరం (M), రామచంద్రయపల్లి (V)లో Sy.No.362, 368 మొదలైనవాటిలో 783.47 ఎకరాల ప్రభుత్వ భూమిని 1000 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం APSPCL కు ఇంతకు ముందు ప్రతిపాదించిన లీజు పద్ధతికి బదులుగా మార్కెట్ విలువ చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

33. రెవెన్యూ:
“ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) బిల్లు, 2024” (L.A. Bill No.18 of 2024)కు సంబంధించి ‘కొర్రిజెండమ్’ (సవరణాత్మక వివరణ) పొందుపరిచిన ముసాయిదా లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

34. రెవెన్యూ:
జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 33 సంవత్సరాల నుండి 66 సంవత్సరాలకు పొడిగించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

35. ఇంధన శాఖ:
విజయవాడలోని HUDCO ప్రాంతీయ కార్యాలయం నుంచి APPFCL ప్రత్యేక టర్మ్ లోన్ పొందేందుకు ₹1,000 కోట్ల ప్రభుత్వ హామీను కల్పిస్తూ ఇంధన శాఖ జారీ చేసిన G.O.Ms.No.75, తేదీ: 07.09.2026 ఉత్తర్వులను రాటిఫై (ధృవీకరించేందుకు) కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

36. ఇంధన శాఖ:
హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ (PSB) నుండి స్పెషల్ టర్మ్ లోన్ తీసుకోవడానికి APPFCL కు రూ.500 కోట్ల ప్రభుత్వ హామీ అందించే జి.ఓ.ఎంఎస్.నం.77, Energy (P.III) శాఖ, తేదీ:9.9.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

37. ఇంధన శాఖ:
అన్నమయ్య జిల్లా కొమ్మూరులో జి.ఓ.ఎంఎస్.నం.16, Energy (Power-II) శాఖ, తేదీ:07.02.2025 ద్వారా M/s మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు కేటాయించిన 2000 MW పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

38. ఇంధన శాఖ:
APPDCL థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిచిపోకుండా తీసుకున్న చర్యలకు రాటిఫికేషన్ ఇవ్వడంతో పాటు, APPDCLకు ₹250 కోట్ల MTL (మధ్యకాలిక రుణం) ను అందించిన APGENCO చర్యలకు పోస్టు ఫాక్టో ఆమోదం తెలిపేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

39. ఇంధన శాఖ:
నంద్యాల జిల్లా మిద్థూరు (M), అలగానూరు గ్రామంలో 24 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి M/s సాయి బయోఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

40. ఇంధన శాఖ:
AP Integrated Clean Energy Policy, 2024 కింద M/s. Resolven Two Energy Pvt. Ltd.కు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కలుగోట్ల, పార్లపల్లె, కడిమెట్ల గ్రామాలు, గోనెగొండ్ల మండలంలోని పెద్ద మర్రివీడు గ్రామాల్లో 75 MW విండ్, 75 MW AC/101.25 MWp DC సోలార్ సామర్థ్యాలతో కూడిన మొత్తం 100 MW విండ్–సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు సామర్థ్యాన్ని కేటాయించడంతో పాటు, ప్రాజెక్టు పరిధిలో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న ప్రభుత్వ/అసైన్డ్ భూములను ఉంటే ఎకరాకు సంవత్సరానికి ₹31,000 లీజు రుసుముతో, ప్రతి రెండేళ్లకు 5% పెంపుతో లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

41. ఇంధన శాఖ:
AP Integrated Clean Energy Policy, 2024 కింద M/s. M Venkata Rao Infra Projects Pvt. Ltd.కు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలం, మేలవోయి గ్రామంలో 675 MW AC/810 MWp DC సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సామర్థ్యాన్ని కేటాయించడంతో పాటు, ప్రాజెక్టు పరిధిలో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న ప్రభుత్వ/అసైన్డ్ భూములను ఉంటే ఎకరాకు సంవత్సరానికి ₹31,000 లీజు రుసుముతో, ప్రతి రెండేళ్లకు 5% పెంపుతో లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

42. ఇంధన శాఖ:
AP Integrated Clean Energy Policy, 2024 కింద M/s. Clean Renewable Energy Hybrid Six Pvt. Ltd.కు వైఎస్సార్ కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం కాసనూరు, బాలపనూరు గ్రామాలు, తొండూరు మండలం తెల్లూరు, మాదూరు గ్రామాల్లో 118.80 MW AC/155.20 MWp DC సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సామర్థ్యాన్ని కేటాయించడంతో పాటు, ప్రాజెక్టు పరిధిలో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న ప్రభుత్వ/అసైన్డ్ భూములను ఉంటే ఎకరాకు సంవత్సరానికి ₹31,000 లీజు రుసుముతో, ప్రతి రెండేళ్లకు 5% పెంపుతో లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

43. ఇంధన శాఖ:
SBI, విజయవాడ బ్రాంచ్ నుండి Term Loan-IV తీసుకోవడానికి APPFCL కు రూ.2000 కోట్ల ప్రభుత్వ హామీ మంజూరు చేసే జి.ఓ.ఎంఎస్.నం.79, Energy (Power-III) శాఖ, తేదీ:16.09.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

44. ఇంధన శాఖ:
రాష్ట్ర డిస్కామ్‌ల తరఫున APPCC ద్వారా విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో M/s. Solar Energy Corporation of India Limited (SECI) నుంచి 1,344 MW/10,752 MWh ISTS-connected Pumped Storage సామర్థ్యాన్ని 40 సంవత్సరాల కాలానికి, అలాగే అర్హత కలిగిన Pumped Hydro Storage Projects (PSPS) నుంచి 500 MW Energy Storage సామర్థ్యాన్ని పారదర్శక పోటీ బిడ్డింగ్ విధానంలో 4 సంవత్సరాల కాలానికి సమకూర్చుకోవడం ఉంది.

45. హోం శాఖ:
ప్రాసిక్యూషన్ శాఖలో Additional Director of Prosecution (Category-II) సూపర్‌న్యూమరరీ పోస్టు ఏర్పాటు, ప్రస్తుత పోస్టుల రీడిజిగ్నేషన్, కొన్ని పోస్టులకు నియామక విధానాన్ని నిర్దేశించడంతో పాటు, “ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ రూల్స్, 2026” ముసాయిదా నిబంధనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), 2023కు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌ను పునర్వ్యవస్థీకరించేందుకు A.P. State Prosecution Service Rules–2026 ముసాయిదా నిబంధనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రాసిక్యూషన్ పోస్టులను BNSS నిబంధనలకు అనుగుణంగా పునఃనామకరణం చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పోస్టును ప్రస్తుత అధికారికి మాత్రమే వ్యక్తిగత/సూపర్‌న్యూమరరీ పోస్టుగా కొనసాగించి, ఆయన పదవీ విరమణ లేదా పోస్టు ఖాళీ అయిన అనంతరం రద్దు చేయనున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను 30% ప్రత్యక్ష నియామకం, 70% పదోన్నతి ద్వారా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను 100% ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మార్పులు BNSSకు చట్టపరమైన అనుసరణతో పాటు పరిపాలనా కొనసాగింపు, ప్రస్తుత సర్వీస్ ఏర్పాట్లకు రక్షణ కల్పించేలా, ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం లేకుండా అమలు చేయనున్నారు.

నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం… (46 నుండి 49)

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, వివిధ పోలీసు విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఉద్భవిస్తున్న సవాళ్లపై వేగవంతమైన స్పందనను అందించడం లక్ష్యంగా తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పట్టణీకరణ, జనాభా పెరుగుదలతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, రవాణా మరియు అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా ఏకీకృత కమాండ్–కంట్రోల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. క్షేత్రస్థాయి పోలీసు విభాగాలపై పర్యవేక్షణ, ప్రత్యేక పోలీసు విభాగాల సమన్వయం, పోలీసు వనరుల సమర్థవంతమైన వినియోగం మరింత మెరుగుపడనుంది.

ప్రతి కమిషనరేట్‌కు IGP/DIGP స్థాయి అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరిస్తారు. BNSS, 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు కూడా కల్పించనున్నారు. ఆయా కమిషనరేట్ల ప్రధాన కార్యాలయాలు తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం నగరాల్లో ఉంటాయి. ప్రస్తుత రెవెన్యూ, పోలీస్ జిల్లాల పరిధులను ఆధారంగా చేసుకుని, ప్రతిపాదిత ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా వాటి పరిధులు నిర్ణయించబడతాయి.

ఇప్పటికే మంజూరైన పోలీసు కేడర్ బలాన్ని పునర్విభజన/పునఃనామకరణ ద్వారా వినియోగిస్తూ ఈ నాలుగు కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేయనున్నారు.

46. హోం శాఖ:
రాజమహేంద్రవరం కేంద్రంగా, IGP/DIGP హోదాలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో రాజమహేంద్రవరం పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. BNSS, 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు కల్పించడంతో పాటు, ప్రస్తుత తూర్పు గోదావరి రెవెన్యూ జిల్లా, తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం) పోలీస్ జిల్లా పరిధులకు అనుగుణంగా మూడు టెరిటోరియల్ జోన్లతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

47. హోం శాఖ:
గుంటూరు కేంద్రంగా, IGP/DIG హోదాలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో గుంటూరు పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. BNSS, 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించడంతో పాటు, ప్రస్తుత గుంటూరు రెవెన్యూ జిల్లా, గుంటూరు పోలీస్ జిల్లా పరిధులకు అనుగుణంగా గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి అనే నాలుగు జోన్లతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

48. హోం శాఖ:
తిరుపతి కేంద్రంగా, IGP/DIG హోదాలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో తిరుపతి పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. BNSS, 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించడంతో పాటు, ప్రస్తుత తిరుపతి రెవెన్యూ జిల్లా, తిరుపతి పోలీస్ జిల్లా పరిధులకు అనుగుణంగా తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ అనే నాలుగు టెరిటోరియల్ జోన్లతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

49. హోం శాఖ:
కర్నూలు కేంద్రంగా, IGP/DIGP హోదాలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో కర్నూలు పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. BNSS, 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించడంతో పాటు, ప్రస్తుత కర్నూలు రెవెన్యూ జిల్లా, కర్నూలు పోలీస్ జిల్లా పరిధులకు అనుగుణంగా కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ అనే ఐదు సబ్ డివిజన్లతో రెండు టెరిటోరియల్ జోన్లుగా కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

50. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ హబ్ AI (AI Integrated Hub) ఏర్పాటు చేసేందుకు M/s. Muthoot Fincorp Limitedకు AP IT & GCC Policy (4.0) 2024–29 కింద 3 ఎకరాల భూమిని కేటాయించేందుకు SIPB చేసిన సిఫార్సుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

51. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
SIPB సిఫార్సుల మేరకు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని YSR EMCలో M/s. AIL Dixon Technologies Pvt. Ltd. (ADTPL) ఏర్పాటు చేసిన యూనిట్‌కు AP Electronics Policy 2021–24 (Zone-B) కింద అర్హత కలిగిన ప్రోత్సాహకాల క్లెయిమ్‌లకు సంబంధించిన గడువును నవంబర్ 2027 నుంచి మరో 10 సంవత్సరాల పాటు పొడిగించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

52. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
SIPB సిఫార్సుల మేరకు, విశాఖపట్నం జిల్లాలో ₹43.75 కోట్ల పెట్టుబడితో IT/ITeS క్యాంపస్ ఏర్పాటు చేయనున్న M/s. Deloitte Touche Tohmatsu India LLPకు Tailor-made Incentives మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

53. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:
ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ (2025–30) కింద రాష్ట్రంలో తమ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేసేందుకు M/s. Photoncore Systems Pvt. Ltd., M/s. Veridata Health Inc., M/s. Quanfluence Private Limited, M/s. TriQuanta Labs Pvt. Ltd., M/s. Quantum Codon Pvt. Ltd., M/s. Srsti Quantum Pvt. Ltd. మరియు M/s. Arohak Technologies Pvt. Ltd. సంస్థలు చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

54. పురపాలక & పట్టణాభివృద్ధి:
స్వర్ణ వార్డుల్లోని (a) వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, (b) వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, (c) వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్–II), (d) వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–II) పోస్టులకు ప్రమోషన్ అవకాశాలు కల్పించేందుకు, మిగులు పోస్టులను సరెండర్ చేయడం లేదా ఎంట్రీ లెవల్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రమోషనల్ ఛానళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2019 స్థానంలో ఈ కేటగిరీలన్నింటికీ ప్రత్యేక సర్వీస్ రూల్స్ జారీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

55. యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
SIPB సిఫార్సుల మేరకు, అమరావతిలో Courtyard by Marriott బ్రాండ్ కింద ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయనున్న M/s. Southern Globe Hotels and Resorts Limited (SGHRL)కు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, గతంలో జారీ చేసిన G.O.Ms.No.38, తేదీ: 16.10.2025ను రద్దు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

56. యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
కడప జిల్లాలో ‘రీజెంటా బై రాయల్ ఆర్కిడ్స్’ బ్రాండ్ కింద హోటల్ చందన గ్రాండ్ — 3-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం M/s J.L. అసోసియేట్స్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

57. యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
G.O.Ms.No.50, YAT&C (T) శాఖ, తేదీ: 20.08.2026లో పేర్కొన్న M/s. JSP Hotels & Resorts LLP సంస్థ పేరును M/s. JPS Hotels & Resorts LLPగా సరిదిద్దేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

58. యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
తిరుపతి రేణిగుంటలో ‘ITC EPIC కలెక్షన్’ బ్రాండ్ కింద 5-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం M/s గ్రాండ్ తిరుపతి హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి SIPB సిఫార్సు మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

59. యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
గుంటూరు జిల్లా అమరావతిలో ‘క్రౌన్ ప్లాజా & హాలిడే ఇన్’ బ్రాండ్ కింద 5-స్టార్ ట్విన్ హోటల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం M/s ఇంద్రోయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు జి.ఓ.ఎంఎస్.నం.39, YAT&C(T) శాఖ, తేదీ:30.6.2026ను సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

60. జలవనరుల అభివృద్ధి:
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో కిలోమీటర్ 111.000 నుంచి 136.000 వరకు (ప్యాకేజీ–6) ఉన్న 12 సూపర్ పాసేజీల నిర్మాణ పనులను ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న M/s. Suma Encon Projects Pvt. Ltd., విశాఖపట్నం సంస్థకు అప్పగించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

61. జలవనరుల అభివృద్ధి:
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు ఫేజ్–II కింద అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కిలోమీటర్ 260.000 నుంచి 300.000 వరకు HNSS మెయిన్ కెనాల్‌కు లైనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, కిలోమీటర్ 285.100 నుంచి 287.100 వరకు టన్నెల్ నిర్మాణ పనులకు ₹337.90 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. (ప్యాకేజీ–2)

62. ఆర్థిక శాఖ:
న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు 31.03.2026 నుంచి అమల్లోకి వచ్చేలా పెంచేందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) యాక్ట్, 1984లోని సెక్షన్ 3(1A)కు సవరణలు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా ఆర్డినెన్సుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

63. సాధారణ పరిపాలన (సమాచార & పౌరసంబంధాల శాఖ):
రాష్ట్రంలో ప్రభుత్వ సమాచారాన్ని, ప్రజా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు విశ్వసనీయమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను (SMIs) గుర్తించి, ధ్రువీకరించి, ఎంప్యానెల్ చేసే విధంగా Social Media Influencers (SMIs) Policyని రూపొందించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యం.

డిజిటల్ ప్రచారం, ప్రజా సమాచారాన్ని బలోపేతం చేయడానికి I&PR శాఖ, APDCL సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించి, వీటి ఆధారంగా ఇతర 6 రాష్ట్రాల విధానాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ ముసాయిదాను రూపొందించనున్నారు.

పాలసీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులపై అధికారిక సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు విశ్వసనీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, ధృవీకరించి, APDCL ద్వారా ఎంప్యానెల్ చేయనున్నారు. సమాచారం నిష్పాక్షికంగా, వాస్తవాధారితంగా, ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి.

ఈ విధానం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్లోని కంటెంట్ క్రియేటర్లకు వర్తిస్తుంది. ప్రారంభ ఎంప్యానెల్‌మెంట్ ఒక సంవత్సరం ఉంటుంది; సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా అధికార సంస్థ నిర్ణయంతో మరో రెండు సంవత్సరాల వరకు, ఒక్కోసారి ఒక సంవత్సరం చొప్పున పొడిగించవచ్చు.

64. మౌలిక వసతుల కల్పన & పెట్టుబడులు:
Goa Shipyard Limited (GSL)కు 400 ఎకరాల భూమిని ఫెయిర్ మార్కెట్ విలువలో 2% వార్షిక అద్దె/లీజు రుసుముతో, ప్రతి సంవత్సరం 5% పెంపుతో కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో 19 ఎకరాల వాటర్‌ఫ్రంట్ భూమికి 50% ప్రీమియం, 5 సంవత్సరాల మారటోరియం, 30 సంవత్సరాల లీజు కాలం, అనంతరం అమల్లో ఉన్న APMB Land Allotment Guidelines ప్రకారం లీజు పొడిగింపు తదితర అంశాలకు కూడా ఆమోదం తెలిపింది.

మచిలీపట్నం పోర్టులో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) ఆధ్వర్యంలో ₹8,000 కోట్ల పెట్టుబడితో బ్రౌన్‌ఫీల్డ్ నౌకానిర్మాణం, నౌకా మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును 400 ఎకరాల వాటర్‌ఫ్రంట్ భూమిలో, సుమారు 1.7 కి.మీ. వాటర్‌ఫ్రంట్‌తో అభివృద్ధి చేయనున్నారు. రక్షణ, కోస్ట్‌గార్డ్ నౌకల నిర్మాణంతో పాటు వాణిజ్య, ఎగుమతి నౌకానిర్మాణం మరియు నౌకా మరమ్మతుల కార్యకలాపాలు చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 5–8 సంవత్సరాల కాలంలో సుమారు 8,000 ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో 3,000 ప్రత్యక్ష, 5,000 పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి. ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సుమారు ₹2,324.17 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇది మొత్తం పెట్టుబడిలో సుమారు 29.05 శాతానికి సమానం. ఇందులో 20% క్యాపిటల్ ఇన్వెస్టుమెంట్ సబ్సిడీ, డీకార్బనైజేషన్ సాయం, విద్యుత్ టారిఫ్ సబ్సిడీ, 100% విద్యుత్ డ్యూటీ మినహాయింపు, రాయితీ పారిశ్రామిక నీరు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, బాహ్య మౌలిక వసతుల సాయం వంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం నౌకానిర్మాణం, నౌకా మరమ్మతుల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు, అనుబంధ పరిశ్రమలకు అవకాశాలు పెరగడం, నైపుణ్య ఆధారిత ఉపాధి కల్పన, ఆంధ్రప్రదేశ్‌లో మారిటైమ్ మరియు పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

65. రెవెన్యూ శాఖ:
తిరుపతిలో International Society for Krishna Consciousness (ISKCON) ఆధ్వర్యంలో Vedic Cultural and Spiritual Centre ఏర్పాటు చేసేందుకు, పెదబంగారునాథం, బెవనపల్లె గ్రామాల్లో మొత్తం 8.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ISKCONకు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శభాష్ సాయి…

-బాల్ బ్యాడ్మింటన్ రాణిస్తున్నబీసీ విద్యార్థి సాయికుమార్ -మంత్రి సవిత అభినందనలు తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *