విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 102 మంది వార్డ్ వాలెoటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగయువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చునని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలెoటిర్ల కొరకు ధరఖాస్తు చేసుకొనే వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 01-01-2021 నాటికి 18 సంవత్సరములునిండి, 35 సంవత్సరములులోపు గల వారై నగర పరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆసక్తిగల నిరుద్యోగయువతీ, యువకులు ధరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబందించి అర్జిదారులు పూర్తి విద్యాఅర్హతల మరియు ఇతర దృవీకరణ పత్రములను జతపరచి http://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా 18-12-2021 తేది లోపుగా ధరఖాస్తు చేసుకొనవలెనని, దీనికి సంబందించి 22-12-2021 తేదిన మౌఖిక పరీక్షలు నిర్వహింపబడునని తెలియజేసారు. ఇతర వివరాల కొరకు అదనపు కమీషనర్ (జనరల్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్ నెంబర్ 8185933187కు సంప్రదించాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News