Breaking News

పొట్టి శ్రీరాములు 69వ వర్గంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా  బుధవారం విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., మరియు నగర పోలీసు అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించడం జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ అమరజీవి  పొట్టి శ్రీరాములు  ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించి అమరులయ్యారని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు, భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మరియు స్వాతంత్ర్య సాదనకు వారు చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఆయన చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి.  మేరి ప్రశాంతి, స్పెషల్ బ్రాంచి ఏ.డి.సి.పి. లక్ష్మీపతి, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *