-రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
-5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపయిన్ లో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పింఛిన అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్లకార్డుస్ ను ప్రదర్శించారు అనంతరం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ని, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయవద్దని కలసి పోరాడుదామని పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు పారిపోతున్నారో సమాధానం చెప్పలని . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఎందరో అమరవీరుల అయ్యారని, విశాఖ ఉక్కు కోసం 1970లో 7గురు ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని, కాని నేడు ysrcp MP లకు పార్లమెంటు మరుయు రాజ్యసభ సమావేశాల్లో ప్లే కార్డ్స్ చూపించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని,AP MP లకు పోరాడే బాధ్యత లేదఅని, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారఅని, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఎక్కడని, డిల్లీలో కాలక్షేపం చేస్తున్నారని, ఢిల్లీలో రగ్గులు కప్పుకొని పార్లమెంట్ లో పోరాడకుండా దాక్కుంటారా అని , అఖిలపక్షం ఏర్పాటు భయమెందుకని, పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించే ధైర్యం కూడా ఏపీ ఎంపీలకు లేదా అని, ఆర్థిక నేరాలపై కాదు ఆంధ్రుల ఆత్మ గౌరవం పై విజయ సాయి రెడ్డి గారు దృష్టిసారించాలని. మీకు ఉద్యమం చేయడం రాకపోతే పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవాలని ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వైయస్సార్సీపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ని చూసైనా మిగతా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఉద్యమించాలని,. టీడీపీ MPలు ఉద్యమించాలని, లేని పక్షాన రాష్ట్రంలో ప్రజల ముందు చులకన అవుతారన్నారు.
పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహేష్ ఈ కార్యక్రమాన్నితన ట్విట్టర్ ఖాతా ద్వారా పార్లమెంట్ వైయస్ఆర్సిపి పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి కి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి విజయవాడ స్థానిక ఎంపీ కేశినేని నాని కి మరొక ఏపీ ఎంపీ పరిమల్ నత్వాని కి ట్యాగ్ చేసినారు. ఈ కార్యక్రమంలో, విజయవాడ నగర వెన్నా శివశంకర్ , ఉపాధ్యక్షులు జనసేన ముఖ్య నాయకులు మైలవరపు కొండలరావు, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, విజయవాడ నగర కమిటీ సభ్యులు మోబినా, కృష్ణ మోహన్ , కొరగంజి వెంకటరమణ , బొట్ట సాయి, s నరేష్ రాఘవరెడ్డి, రాకేష్, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు రమాదేవి, భవాని, కూర్మా రావు , జనసేన నాయకులు లక్ష్మణ్, , మల్లెపూ సురేష్ బావి శెట్టి శ్రీను పండు, పొట్నూరి ప్రసాద్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News