Breaking News

పుంజుకున్న ధాన్యం సేకరణ…

-రూ. 161 కోట్ల విలువైన 82,367 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇంతవరకు 8,874 మంది రైతుల నుంచి రూ. 161.08 కోట్ల విలువైన 82,367 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ డా. కె.మాధవిలత చెప్పారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్‌ యువర్‌ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 17 మంది రైతులు ఫోన్‌ చేయగా వారిలో 13 మంది మాత్రమే ధాన్యం కొనుగోలు విషయంపై తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా గూడూరు మండలానికి చెందిన రైతు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రైతుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నందుకు జాయింట్‌ కలెక్టర్‌ డా. కె. మాధవిలతకు దన్యవాదాలు తెలిపారు. గంపలగూడెం నుంచి రాంబాబు అనే రైతు మాట్లాడుతూ 1318 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ స్పందిస్తూ రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు 1318 రకం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. గుడివాడ మండలం నుంచి రైతులు వెంకటనాగేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ 2077 రకం ధాన్యం ప్రోక్యూర్మెంట్‌ పోర్టల్‌ల్లో కనబడటం లేదని తెలుపగా ఈ విషయంపై జెసి స్పందిస్తూ ఈ సాంకేతిక సమస్య రెండు మూడు రోజులో పరిష్కారమవుతుందన్నారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి రమేష్‌ అనే రైతు ఈ` క్రాప్‌లో ధాన్యం రకం తప్పుగా నమోదైనదని తెలుపగా దీనిపై జెసి మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. మండవల్లి మండలం నుంచి నానిబాబు పెడన మండలం నుంచి కృష్ణప్రసాద్‌ గుడివాడు నుంచి శ్రీనివాస్‌, సతీష్‌ కుమార్‌ అనే రైతులు ప్రోక్యూర్మెంట్‌ పోర్టల్‌లో కనబడటం లేదని తెలుపగా ఈ విషయంపై జెసి స్పందిస్తూ ఈ సాంకేతిక సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. పెనుగంచిప్రోలు నుంచి రామారావు అనే రైతు బిపిటీ రకం ధాన్యం కొనుగోలు చేస్తారా అనే ప్రశ్నకు జెసి సమాదానం ఇస్తూ రైతు భరోసా కేంద్రంలో ధాన్యంలో విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను పొందవచ్చునన్నారు. జగ్గయ్యపేట నుంచి బ్రహ్మయ్య అనే రైతు మాట్లాడుతూ తమ ధాన్యం తక్కువ గా ఉన్నందున రవాణా సౌకర్యం కల్పించమని కోరారు. దీని పై జెసి మాధవిలత స్పందిస్తూ రవాణా సౌకర్యం కల్పించాలని కొనుగోలు కేంద్ర నిర్వహకులను ఆదేశించారు. గూడూరు నుంచి జితేంద్ర అనే రైతు తమ ధాన్యం ఎక్కడ అమ్మాలని అడిగిన ప్రశ్నకు జెసి సమాధానమిస్తూ సమీపంలోని రైతు భోరోసా కేంద్రం లేదా ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్‌ డా. శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *