Breaking News

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) కింద జిల్లాలో ఇప్పటి వరకు 72,797 మంది లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకున్నారు…

-ఈనెల 21వ తేదీ మంగళవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గుడివాడ లో జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 72,797మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని రూ.15,89,57,758 రూపాయలు చెల్లించారు.
డివిజన్ల వారీ …
జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద బందరు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి 20,978 మంది లబ్ధిదారులు రూ.4,03,78,126 రూపాయల చెల్లించగా, గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 13,870 మంది లబ్ధిదారులు రూ. 2,61,44,404 రూపాయలు చెల్లించడం జరిగింది. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,824 లబ్ధిదారులు రూ.4,00,46,892 రూపాయలు చెల్లించగా, విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 23,125 మంది లబ్ధిదారులు 5,23,88,336 రూపాయల చెల్లించడం చెల్లించి జగనన్న గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తారన్నారు. గుడివాడలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని జిల్లా స్థాయి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సందర్భంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఉపయోగించకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లను పంపిణీ చేస్తారన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించే జిల్లా వ్యాప్త కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *