విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్టమస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగని ఈ పండుగను కూడా చాలమంది ఆసక్తిగా చూస్తుంటారని జిల్లా ఉపరవాణా కమీషనర్ యం పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో శుక్రవారం నాడు ఉద్యోగులు సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా జిల్లా ఉపరవాణా కమీషనర్ యం పురేంద్ర హాజరయ్యారు. యం పురేంద్ర మాట్లాడుతూ మన తోటి వారి పట్ల ఎప్పుడు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన నాడే క్రీస్తు చెప్పిన మార్గంలో నడిచిన వారవుతామని ఆయన అన్నారు. పాపం చేసిన వాళ్లనూ కూడా క్షమించడం క్రీస్తు తత్వంలోని గొప్పదనం మన్నారు. ఇతరులపట్ల క్షమా, దయ, కరుణ గుణాలను కలిగి సేవా దృక్పథంతో ఉండాలన్నారు. కార్యాలయాలకు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం వారికీ తగిన సమాచారాన్ని ఇవ్వడం కూడా సేవాభావంలో ఒక భాగమన్నారు. ఆపద సమయాలలో ఉన్నప్పుడు ఒకరి కొకరు సహాయ పడేటట్లు ఉండాలన్నారు. అనంతరం క్రిస్తుమస్ కేక్ ను కట్ చేసి, అందరికి అందజేశారు. ఈ వేడుకలలో దైవజనులు కే సువర్ణ రాజు, ఆర్టీఓలు ఎ విజయసారధి, సీతాపతిరావు, మంగదేవి, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు డి శ్రీనివాస్, యం రాజుబాబు, పి విజయ, యం వి ఇన్స్పెక్టర్స్ డి ఎస్ ఎస్ నాయక్, జి సంజీవ్ కుమార్, ఎస్ టి ఎ అధికారిని జె ఆశదేవి, బీనా, కార్యాలయపు పరిపాలనాధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, ప్రభాకర లింగం, కవిత, భాగ్యరేఖ మరియు ఉద్యోగులు ఉన్నారు.
Prajavartha Online Telugu News