Breaking News

పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ శనివారం బృందావన్ కాలనీ నందలి పలు వీదులలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో ఆయా వీదులలో చేపట్టివలసిన రోడ్ ప్యాచ్ వర్క్ పనుల విషయమై అధికారులతో చర్చించి, వెనువెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్ ను ఆదేశించారు. అదే విధంగా ఆయా ప్రదేశాలలో డ్రెయిన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్ తో పాటుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాత్రుడు మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *