
విజయవాడ/ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహనిర్మాణం ప్రారంభించిన లబ్దిదారులకు కట్టిన మేరకు 82 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు . శుక్రవారం నగరంలోని నిరుపేదలకు ఇబ్రహీంపట్నంలో ఇచ్చిన లేఅవుట్లను ఆయన పరిశీలించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు 2 వేల ప్లాట్లు పంపిణీ చేశారు . అలాగే విజయవాడ గ్రామీణ నిరుపేదలకు 2,400 ప్లాట్లు మంజూరు చేశారు . ఇబ్రహీంపట్నంలోని పేదలకు 780 ప్లాట్లు , కొండపల్లి మున్సిపాలిటీ లబ్దిదారులకు 800 ప్లాట్లు ఉన్నాయి . అన్ని లేఅవుట్లను ఆయన పరిశీలించారు . త్వరితగతంగా గృహాల నిర్మాణం చేపట్టాలని కొండపల్లి మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు . లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా ఇనుము , సిమెంట్ పంపిణీ గోడౌన్లను ఏర్పాటు చేయాలన్నారు . మున్సిపల్ కమీషనర్ తో సంప్రదించి ఇసుక పంపిణీ కోసం కూపన్లు జారీచేయమని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు . త్వరితగతిన నిర్మాణం పూర్తిఅవ్వాలని అందుకు అవసరమైన పునాదులు కూడా తీయమని కలెక్టర్ సూచించారు . ప్రతి వారం ఒక్కో వాలంటీర్లు ఒక గృహం , ఇంజనీరింగ్ అసిస్టెంట్ 5 గృహాలు , హౌసింగ్ ఏఐ / డిఇ 20 గృహాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు . లబ్దిదారులు నిర్మాణం చేపడితే బేస్మెంట్ పూర్తయిన తరువాత సంబంధిత మొత్తం కూడా వారి ఖాతాల్లో జమ అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు . కొండపల్లి మున్సిపాలిటీలో 1800 గృహాలు ఉన్నాయని ఆ మేరకు నిర్మాణాల ప్రగతి కూడా చూపించాలని కలెక్టర్ ఆదేశించారు . అనంతరం రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన 60 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్‌ను కలెక్టర్ పరిశీలించారు .
బట్టర్ ఫ్లై పార్క్ తనిఖీ చేసిన కలెక్టర్ :
అనంతరం మూలపాడు బటర్ ఫ్లై పార్క్ ను కలెక్టర్ తనిఖీ చేశారు . పార్క్ లో సీతాకోకచిలుకల జాతులు తెలిపే చిత్రాలు , వాటి వివరాలు తదితర విషయాలన్ని ప్రదర్శించమని అటవీశాఖ అధికారులను ఆదేశించారు . పార్కు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేలా వసతులు కూడా కల్పించాలన్నారు . త్రాగునీరు , టాయిలెట్లు , సేదతీరేందుకు అనువైన స్థలాలు కూర్చునేందుకు వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు . ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమీషనర్ శ్రీధర్ , తహసీల్దార్ ఎం . సూర్యారావు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News