Breaking News

శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వొచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి… : ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ

పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త :
శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టవలసి ఉందని, సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై వి ప్రసన్న లక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పట్టిసం ఫెర్రీ పాయింట్ వద్ద శివరాత్రి వేడుకలు నిర్వహణపై అధికారులు, తదితరులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా శివరాత్రి వేడుకలు నిర్వహించాల్సి ఉందన్నారు. రెండు రాత్రులు, ఒక పగలు భక్తుల తాకిడి ని దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు తూ. ఛా. తప్పకుండా పాటించాలని ఆర్డీవో స్పష్టం చేశారు. దర్శనానికి వొచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువపత్రం తీసుకుని రావాల్సి వుంటుందని, వారి మొబైల్స్ లో కోవిడ్ సర్టిఫికెట్ వ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అందుకు అనుగుణంగా దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. రేవు వెడల్పు ను దృష్టిలో పెట్టుకుని పోర్ట్ అధికారులు తగిన సూచనలతో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాల్సి ఉందన్నారు. భక్తులు దర్శనం చేసుకొనేందుకు ఫెర్రీ వద్ద 5 పంట్ లను సిద్ధం చెయ్యడం జరుగుతోందని తెలిపారు. ఫైర్, ఫారెస్ట్, విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. విద్యుత్ తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిఎస్పీ కె.లతాకుమారి మాట్లాడుతూ, ఇద్దరు ఏసీపీ, 54 మంది ఎస్ ఐ లు, 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 100 అడుగులతో కంపార్టమెంట్స్, క్యూ లైన్స్, కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ క్యూ లైన్స్ క్రమబద్ధీకరణ, ప్రసాదాలువితరణ ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.20/50/300 దర్శనం టికెట్స్ భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాము. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో జంగిల్ క్లీయరెన్సు, బ్యార్రికేట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ వారిచే వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కోసం ప్రత్యేక తాత్కాలిక బస్ స్టాండ్, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు సమాచారం అందచేయ్యడం జరుగుతుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు యజమానులతో సమావేశం నిర్వహించడం ద్వారా అధిక ధరలు వసూలు చెయ్యకుండా అవగాహన కల్పిస్తాము. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రాగునీరు, ఆహారం, చిన్నారులకు పాలు అందచేయ్యడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, సర్పంచ్ ఎస్. శ్రీరామ మూర్తి, జెడ్పీ టిసి కె. హేమకుమారి, సంబంధించిన శాఖలు అధికారులు, ఏసీ ఎండోమెంట్ సీహెచ్. చంద్రశేఖర్, తహశీల్దార్ బి. సుమతి,సి ఐ కె. విజయబాబు, జమిందార్ హెచ్. సీతారామ శాస్త్రి, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి కృష్ణా రావు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *