Breaking News

టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. టిడ్కో లబ్ధిదారులకు రుణాల మంజూరుపై శుక్రవారం విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థ, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ మున్సిపల్‌ కమిషనర్లతో జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ నగరంలోని క్యాంప్‌ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధ్వర్యంలో వివిధ కేటగిరీల కింద ఏపి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్లతో అధికారులు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 19,376 వివిధ కేటగిరీలకు చెందిన టిడ్కో గృహా లబ్ధిదారులకు గాను 679 కోట్ల రూపాయల రుణ మంజూరు లక్ష్యాలకు గాను నేటి వరకు 2,974 మంది లబ్ధిదారులకు పైగా 47.14 కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించారన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువను బట్టి 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో గృహాం 10 నుండి 12 లక్షల రూపాయలు, 430 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహా 13 నుండి 15లక్షల రూపాయలు విలువ కలిగి ఉంటాయని అందువల్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరు పై బ్యాంకర్లకు ఎటువంటి సందేహం అక్కర్లేదని కలెక్టర్‌ అన్నారు. మున్సిపల్‌ కమీషనర్లు, గృహా నిర్మాణ, టిడ్కో శాఖాధికారులు బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌లతో సమన్వయం చేసుకొని త్వరితగతిన రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్‌ అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో నగరపాలక మున్సిపల్‌ కమీషనర్‌ రంజిత్‌ భాషా, జాయింట్‌ కలెక్టర్‌ ( హౌసింగ్‌) శ్రీవాస్‌ నూపుర్‌ అజయ్‌కుమార్‌, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌ బి. చిన్నొడు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *