Breaking News

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీని కలిసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సింగ్ నగర్ మినీ బస్టాండ్ పనులు త్వరగా ప్రారంభించాలని వినతిపత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నూతన మినీ బస్టాండ్ మంజూరైన నేపథ్యంలో పనులను త్వరితగతిన ప్రారంభించేలా చొరవ చూపాలని కోరారు. నిత్యం ఈ ప్రాంతం నుంచి వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా బస్టాండ్ నిర్మాణంతో నూతనంగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలకు ప్రయాణం సులభతరమవుతుందని తెలిపారు. కావున అన్ని సౌకర్యాలతో ఆధునిక బస్టాండ్ నిర్మాణం వీలైనంత త్వరగా చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన నెల రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *