Breaking News

విఘ్నేశ్వరుని కృప నియోజకవర్గ ప్రజలపై సదా ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-లూనా సెంటర్లో శ్రీ లక్ష్మి గణపతి ఆలయ పునః నిర్మాణానికి భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ లూనాసెంటర్లో శ్రీ లక్ష్మి గణపతి ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కన్నులపండువగా జరిగింది. కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఏ కార్యం చేపట్టాలన్నా తొలి పూజ వినాయకునితోనే మొదలవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఏ ఆలయానికి వెళ్లినా మొదట గణనాథుడినే దర్శించుకుంటామన్నారు. జ్ఞానాన్ని, సంకల్ప సిద్ధిని అనుగ్రహించే గణనాథున్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా, స్మరించినా, పూజించినా ఆ రోజున పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. సకల విఘ్నాలు తొలగించే వినాయకుని అనుగ్రహం సదా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైనా, నియోజకవర్గ ప్రజలపై ఇదే విధంగా కొనసాగాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండలరావు, నాయకులు దేవిరెడ్డి రమేష్ రెడ్డి, బొమ్మిశెట్టి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *