Breaking News

పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య అమలుకు ఫిక్కీ సహకారం…

-పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం
-ఫిక్కీ ని ఏపీ కు ఎక్స్పర్ట్ ఏజెన్సీ గా నియమించిన కేంద్ర ఇంధన శాఖ కు చెందిన బీఈఈ
-ఏపీ పాట్ సైకిల్-2లో దాదాపు రూ.2356.41 కోట్ల విలువైన 3430 MU కి సమానమైన 0.295 ఎంటీఓఈ ఇంధనం ఆదా
-ఏపీ పాట్ సైకిల్-1లో దాదాపు రూ.1600 కోట్ల విలువైన 2386 MU కి సమానమైన 0.20 ఎంటీఓఈ ఇంధనం ఆదా
-2030 నాటికి ఏపీ లో 6.68 ఎంటీఓఈ ఇంధన ఆదా చేయడమే లక్ష్యం
-రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా లో-కార్బన్ టెక్నాలజీల ద్వారా పారిశ్రామిక ఇంధన సామర్థ్యం పెంపు
-పాట్ సైకిల్-2లో దేశం లో దాదాపు రూ.31,445 కోట్ల విలువైన 13.28 ఎం టీ ఓ ఈ ఇంధనం ఆదా
-రవాణా, విమానయానం, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు మరియు షిప్పింగ్ – PAT పథకానికి కొత్త చేర్పులు
-నూతనంగా పాట్ పరిధిలోకి రవాణా, విమానయానం, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు , షిప్పింగ్
-ఏపీ కి ఫిక్కీ ని ఏజెన్సీ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాం.. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం ద్వారా పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న గట్టి ప్రయత్నాలను గుర్తించిన కేంద్రప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ర్టంలో ఇంధన పొదుపు, అభివృద్ధి కోసం నిపుణుల ఏజెన్సీగా ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ)ని నియమించింది. రాష్ట్రం ఈమేరకు నిర్దేశించుకున్న ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి, పాట్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఫిక్కీని నియమించింది.
పాట్ పథకం సైకిల్-2లో ఆంధ్రప్రదేశ్ దాదాపు రూ.2356.41 కోట్ల విలువైన 3430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ను ఆదా చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో దాదాపు రూ.1600 కోట్ల విలువైన 2386 మిలియన్ యూనిట్ల ఇంధనానికి సమానమైన దాదాపు 0.20 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంటన్ మేర ఇంధనాన్ని పొదుపు చేయగలిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ ఈసీఎం)కు బీఈఈ కొన్ని సూచనలు చేసింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 2030 నాటికి బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అందులో భాగంగా రాష్ర్టం 2030 నాటికి 6.68 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించింది. ఈక్రమంలోనే 2070 నాటికి శూన్య కార్బన్ ఉద్గారాలను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పేర్కొంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఏపీ తరహా రాష్ర్టాల్లో ఫాస్ట్ ట్రాక్ మోడ్లో పాట్ పథకాన్ని అమలు చేయడంపై బీఈఈ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ర్టంలో అమలుచేయనున్న పాట్ కార్యక్రమాలకు భారతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ర్టీ (ఫిక్కీ) సహకారం అందజేసేందుకు దానిని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది.
రాష్ర్టంలో ఇంధన సామర్ధ్య చర్యల అమలుకు సంబంధించి ఇంధన సామర్ధ్య ఛట్టం 2001 ప్రకారం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పలు రకాలుగా ప్రోత్సహిస్తూ వస్తోంది. భారత దేశంలో ఇంధన సామర్ధ్య రంగంలో పాట్ పథకం గేమ్ ఛేంజర్గా నిరూపితమైందని పేర్కొంది. రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సమర్థవంతమైన మరియు తక్కువ-కార్బన్ సాంకేతికతలను వేగవంతంగా అవలంబించడం ద్వారా పెద్ద ఇంధన ఆధారిత రంగాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
పాట్ సైకిల్-1 కింద 427 ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రియల్ యూనిట్లలో 31 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా దాదాపు రూ.9,500 కోట్ల విలువైన 8.67 ఎంటీఓఈను ఆదా చేయడం జరిగింది. దీనిద్వారా జాతీయ ఇంధన పొదుపును సాధించడంలో బీఈఈ కీలకపాత్ర పోషించింది. అలాగే, పాట్ సైకిల్-2లో, 621 ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రియల్ యూనిట్లలో 61 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో దాదాపు రూ.31,445 కోట్ల విలువైన 13.28 మిలియన్ల ఇంధన ఆదా చేయడం జరిగింది.
పాట్ పథకం ప్రస్తుతం 13 రంగాలను కవర్ చేసే 1073 డీసీల(భారీ ఇంధనం ఉపయోగించే పరిశ్రమలు)ను కవర్ చేస్తుంది. ఇవి పారిశ్రామిక ఇంధన వినియోగంలో సగం మాత్రమేనని బీఈఈ అధికారులు తెలిపారు. పారిశ్రామిక ఇంధన వినియోగంలో కనీసం 80 శాతాన్ని కవర్ చేయడానికి పాట్ ప్రోగ్రామ్ను పెంచడానికి, బీఈఈ పాట్ పథకంలో రవాణా, విమానయానం, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు మరియు షిప్పింగ్ వంటి అదనపు రంగాలను చేర్చింది.
బీఈఈ ప్రకారం, భారతదేశం మొత్తం ఇంధనంలో 40 శాతం పారిశ్రామిక రంగం మాత్రమే వినియోగిస్తుంది. భవిష్యత్తులో ఈ రంగం ఇంధన వినియోగంలో వేగవంతమైన పెరుగుదలను నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఇంధన వినియోగం 347 ఎంటీఓఈ ఉండగా 2031 నాటికి ఇంధన వినియోగం 443.4 ఎంటీఓఈ కు చేరుతుందని అంచనా.
ఎనర్జీ కన్జర్వేషన్ మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాల అమలులో ఏపీకి మద్దతు ఇచ్చినందుకు మరియు ఇంధన సామర్థ్య లక్ష్యం పట్ల రాష్ర్టం యొక్క నిబద్ధతను గుర్తించి ఫిక్కీని అందించినందుకు బీఈఈకి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పారిశ్రామిక రంగంలో పాట్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, నిరంతర (24×7) విద్యుత్ సరఫరాను అందించడానికి (16090 ఎంయూ వరకు ఇంధన డిమాండ్ ఉంది) నిరంతర ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కిచెప్పినందున, ఇంధన సామర్థ్య చర్యలు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యానికి సహాయపడతాయని అధికారులు తెలిపారు.
పరిశ్రమల్లో ఎక్కువ ఇంధన పొదుపు సాధించడం ఖచ్చితంగా మంచి విజయమని పేర్కొంటూ, పెద్ద ఇంధన-ఇంటెన్సివ్ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యంలో తక్కువ ఖర్చుతో కూడిన మెరుగుదల అమలును వేగవంతం చేయడానికి పాట్ పథకం సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఇంధన సామర్థ్య రంగంలో రాష్ట్రం ఇప్పటికీ భారీ ఇంధన పొదుపు సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఇంధన సామర్థ్యంతో ఇంధన రంగం మరియు దాని ఆధారిత రంగాలు రెండూ ప్రయోజనం పొందుతాయని అధికారులు తెలిపారు.
ఫిక్కీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రంగాలతోపాటు కొత్త రంగాల్లోని వినియోగదారులను (పాట్ క్షేయం ను అమలు చేసే పరిశ్రమలు) గుర్తించడంలో ఏపీఎస్ఈ సీఎం SDA కి మద్దతు ఇస్తుంది. వారు ఇతర రాష్ట్రాలు లేదా దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, కొత్త సాంకేతికతలను సంకలనం చేయాల్సి ఉంటుంది. అలాగే, ఏపీలోని పారిశ్రామిక యూనిట్లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అన్వేషించాల్సి ఉంటుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *