మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విషయ పరిజ్ఙానంతో బాటు అక్షరజ్ఙానం ఉంటేనే, ఏం జరుగుతుందో? ఏం చేస్తున్నామో? అనే ఒక అవగాహన కలిగి ఉంటామని, నేర్చుకునే వయస్సులో చదువుకోవాలని చదువుతున్న వయస్సులో విషయాల పై సరైన అవగాహన కల్పించుకుంటూ, ఆసక్తి ఉన్న విషయంలో మరింత పరిజ్ఙానం పెంపొందించుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు.
సోమవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని రాజుపేటకు చెందిన గంజాల నాగమణి మంత్రికి తన సమస్యను చెప్పింది. తన భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తూ, అర్బన్ బ్యాంక్ లో ఇంటి మీద రుణం తీసుకొన్నారని ఆ తర్వాత మూడు నెలలకె ఆయన చనిపోయారని ఆమె చెప్పింది. ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం 4 లక్షల రూపాయల య్యిందని బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని , తాను రోల్డ్ గోల్డ్ కవరింగ్ పనిచేసుకొంటూ ఇద్దరు పాపలను చదివిస్తున్నానని తెలిపింది. మీ డివిజన్ కార్పొరేటర్ రాంప్రసాద్ తో మాట్లాడతానని ఆమెకు తెలిపి ఇద్దరు పిల్లలను మంత్రి పలకరించి బాగా చదువుకోవాలని, ఎందుకు బాగా చదవాలి అని వారిని ప్రశ్నించారు. జాబ్ కోసమని ఒక బాలిక జవాబు ఇచ్చింది..మరి జాబ్ ఎందుకని మళ్ళీ మంత్రి అడిగారు.అమ్మను బాగా చూసుకోవడానికని ఆ చిన్నారి దైర్యంగా తెలియచేయడంతో మంత్రి పేర్ని నాని ఎంతో సంతోషించారు. మీకు తప్పక సహాయం జరుగుటుందమ్మా ..నాది బాధ్యత అని వారికి తెలిపారు.
మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామం కుమ్మరి గూడెం కు చెందిన కేసన అన్నపూర్ణ అనే వృద్ధురాలు మంత్రికి తన ఇబ్బందిని తెలిపింది. తన కుమారుడు మాణిక్యాలరావు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని మంగినపూడి పోస్ట్ ఆఫీస్ లో ప్రమాద బీమా చేయించాడని ఆ డబ్బు రావడంలో జాప్యం జరుగుతుందని చెప్పింది. స్పందించిన మంత్రి పేర్ని నాని వెంటనే మంగినపూడి సర్పంచ్ స్వామికి ఫోన్ చేసి వృద్ధురాలి కుమారుడి ఇన్సూరెన్స్ విషయం చెప్పి పరిష్కారించాలని ఆదేశించారు. అమ్మా మీ వెంట ఉన్న పిల్లవాడు ఎవరని అడిగారు. తన మనవడిని వాడి తల్లితండ్రులు చనిపోవడంతో తానె పోషిస్తున్నట్లు తెలిపింది. ఏమి చదివిస్తున్నావని అడిగారు.. బడికి వెళ్ళనని మారం చేస్తున్నట్లు చెప్పింది. మచిలీపట్నం లోని హైని పాఠశాలలో చేర్పించమ్మ బాబు భవిష్యత్తు పాడు చేయవద్దని సూచించారు.
చల్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మి మంత్రికి తన కష్టాన్ని చెప్పింది, తన భర్త 7 నెలల క్రితం కారు డ్రైవర్ గా పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయారని తనకు వితంతువు పింఛన్ రావడం లేదని, పది సంవత్సరాల క్రితం అమ్మేసిన కారుని ఆన్లైన్ లో స్వంత కారుగా చూపడంతో పెన్షన్ మంజూరు అవడం లేదని , తన ఆరోగ్యం బాగోవడం లేదని మీరే సహాయం చేయాలని అభ్యర్ధించింది.
స్థానిక 2 వ డివిజన్ కు చెందిన కొందరు పెద్దలు కార్పొరేటర్ పరింకాయల విజయచందర్ తో మంత్రిని కలిసి తాము ఒక ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకోని మదర్సాను ఏర్పాటు చేసుకుని విద్యార్థినీ విద్యార్థులకు ఉర్ధూ భోదించనున్నామని, మీరు వచ్చి ఆ మదర్సాలను ప్రారంభించాలని కమిటీ అధ్యక్షులు ఖాజీ అబ్దుల మహ్మద్ రసూల్, కార్యదర్శి ఉస్మాన్ ఖాన్, భాజానీ , షరీఫ్ లు కోరారు.
మచిలీపట్నం గుండుపాలెం గ్రామ సర్పంచ్ తూమాటి శ్రీనివాసరావు మంత్రి వద్ద తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్ధించారు. తమకు 30 విద్యుత్ స్థంబాలు అవసరత ఉందని, నాయి బ్రాహ్మణుల వీధిలో 5 స్థంబాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.
Prajavartha Online Telugu News