Breaking News

విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ అధ్యాయనం, ఆవిష్కరణలు పట్ల ఆశక్తి పెంచుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ అధ్యాయనం, ఆవిష్కరణలు పట్ల ఆశక్తి పెంచుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె. సునీత పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, సర్ సివి రామన్ భౌతిక శాస్త్రం లో చేసిన రామన్ ఎఫెక్ట్ కి నోబుల్ బహుమతి పొందినట్లు తెలిపారు. రామన్ ప్రభావం మూలాల, పరిశోధన లు పై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పై ఆసక్తి పెంచుకుని సమాజానికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చెయ్యాల్సి ఉందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1928 లో సర్ సివి రామన్ ” రామన్ ఎఫెక్ట్ ” ను ఫిబ్రవరి 28 న ఆవిష్కరించారని, అందుకే ప్రతి ఏడాది ఈరోజు ను జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నమని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని క్విజ్ పోటీలు నిర్వహించి, బహుమతి ప్రధానం చేశారు. టి సాయిలక్ష్మి పర్యావరణం పై సైన్స్ ప్రభావం తయారు చేసిన ఆవిష్కరణ ను అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు సాయి సుందర్, భూపతిరాయులు, సాదిక్, సూర్యనారాయణ, అధ్యాపకులు, అధ్యపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *