Breaking News

విద్యార్ధులు క్రీడల పట్ల ఆశక్తి కనపరచి ఉన్నతంగా రాణించాలి…

-చిన్న వయస్సులో క్రికెట్ లో రాణించి ప్రతిభ కనపరచిన టి.హర్ష సాయి సాత్విక్ కు అభినందనలు
-కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటివల మూలపాడు నందు జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను తిలకించి క్రికెట్ నందు ప్రతిభ కనపరచిన నూజివీడు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధి టి. హర్ష సాయి సాత్విక్ ని ఆటతీరును గుర్తించిన కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ శనివారం తన ఛాంబర్ నందు హర్ష సాయి సాత్విక్ ను అభినందించి క్రికెట్ కిట్ బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు క్రీడల పట్ల ఆశక్తి కనపరచి ఉన్నతంగా రాణించాలని, క్రీడాకారులకు ప్రభుత్వం నుండి అనేక ప్రోత్సాహాలు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని అన్నారు. చిన్న వయస్సులో క్రికెట్ పట్ల ఆశక్తి కనపరచుట ఎంతో అభినందనీయమని, కొనియాడుతూ రాభోవు రోజులలో మరిన్ని విజయాలు సాధించి క్రీడాకారునిగా మంచి గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గతంలో హర్ష సాయి సాత్విక్ గత 7 సంవత్సరాలు వయస్సు నుండి క్రికెట్ నందు తన ప్రతిభను కనపరస్తూ, 9వ ఏళ్ల వయస్సులో జిల్లా స్థాయిలో అనేక మ్యాచ్ లో పాల్గొని అండర్ 14 లో 87 పరుగులు, అండర్ 16లో 50 పరుగులు మరియు అడివినెక్కాలం నందు జరిగిన మ్యాచ్ నందు 100 పరుగులు సాధించుట జరిగిందని తండ్రి విశ్వనాధ్ రెడ్డి కమిషనర్ కి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *