విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవినేని మురళి 34వ వర్ధంతి సందర్భంగా ఆయన సన్నిహితులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లా పద్మావతి, మాగంటి నవీన్ లు పారిశుద్ధ్య కార్మికుల కు మరియు పేద ప్రజలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గురువారం 4వ డివిజన్ భారతి నగర్ నందు,12వ డివిజన్ ఆటో నగర్ నందు జరిగిన పంపిణీ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని మురళి మీద అభిమానంతో ఆయన సన్నిహితులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు. తదనంతరం గాంధీనగర్ skvc పిల్లల అనాథ శరణాలయం నందు కొండేటి రాంబాబు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, ప్రసాద్, గల్లా రవి,కాళేశ్వరవు, ఉకోటి రమేష్, బచ్చు మురళి, శెటికం దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News