Breaking News

ఘనంగా దేవినేని మురళి వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నాటి సామాజిక పరిస్థితుల వలన వివక్షకు గురి అవుతున్న బడుగుబలహీన వర్గాలకు అండగా స్వర్గీయ దేవినేని మురళి అలుపెరుగని పోరాటం చేసారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. దేవినేని మురళి 34 వ వర్ధంతి సందర్భంగా గురువారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం అభిమానులు, పార్టీ కార్యకర్తలతో వెళ్లి గుణదల వంతెన వద్ద గల మురళి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని మురళి మాలో నిరంతర స్పూర్తి దాయకులు అని,వారి ఆశయసాదనకు కృషి చేస్తామని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది దేవినేని అభిమానులు, విద్యార్థి నాయకులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజషన్ ఇప్పటికి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని భవిష్యత్తు లో ఆర్గనైజషన్ ను మరింత విస్తృత పరుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాస్తా వైసీపీ సీనియర్, నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ల చెల్లారావు, ముసునూరి సుబ్బారావు మరియు కార్పొరేటర్లు, ఇంచార్జిలు, వైసీపీ నాయకులు,దేవినేని అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *