-11వ అడిషనల్ జడ్జి G.మాలతి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తెనాలిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 260 కేసులు పరిష్కారమయ్యాయని 11వ అదనపు జిల్లా జడ్జి మాలతి అన్నారు. ఆమె మాట్లాడుతూ కక్షిదారులుఈపర్యాయం గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో పాల్గొని సివిల్ క్రిమినల్ మోటార్ వెహికల్ బ్యాంక్ మనోవర్తి, గృహహింస, అమలు (E.P) కేసులు రాజీ మార్గంలో పరిష్కారమ య్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు ,అదనపు సీనియర్ సివిల్ జడ్జి కే వాణి ,ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ షరీఫ్, మొదటి జూనియర్ సివిల్ జడ్జి షేక్ రహంతుల్లా- రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ సెక్రెటరీ బొల్లిముంత విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ జయరామ్ దుర్గాప్రసాద్ సోలా శంకర్ ప్రభావతి వేజెండ్ల జగ్జీవన్ తదితర న్యాయవాదులు గుమస్తా లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News