శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుడివాడ, మార్చి, 26:
మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గుడివాడ మండలం శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మురుగు నీటి సమస్య ఎక్కువగా ఉందని మురుగు నీటిలో కాలుష్య కారకాలు 40 శాతానికి మించి ఉండటంతో ఎటువంటి అవసరాలకు వినియోగించడానికి వీలులేకుండా ఉందన్నారు. మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగునీటిని శుద్ది చేసి కాలుష్య కారకాలను 10 శాతం లోపు తీసుకొనివచ్చి ఆ నీటిని జిల్లాలో వివిధ అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామం పట్టణాలలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటిని పంట సాగు, తదితర అవసరాలకు వినియోగించటం జరుగుతుందన్నారు దీనివల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, శుద్ది చేసిన నీటిని వివిధ పంటల సాగుతో పాటు, ఇతర అవసరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మురుగునీటి శుద్దికరణ ప్లాంట్లను గుడివాడ మండలం శేరివేల్పూరు, సిద్ధాంతం గ్రామాలలో సాయిల్ బయో టెక్నాలజీ తో ప్రయోగాత్మకంగా 30 ఎం.ఎల్.డి. సామర్ధ్యం గల మురుగు నీటి శుద్దికరణ ప్లాంట్లను ఒకొక్కటి 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో స్వచ్చా భారత్ మిషన్ 3.5 లక్షల నిధులు సమకూర్చగా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నిధుల నుండి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మురుగు నీరు పేరుకుపోయి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున మురుగు నీటి శుద్దికరణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో RWS సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.వి.వి. సత్యనారాయణ , గుడివాడ ఎంపిడివో వెంకటరమణ, శేరివేల్పురు గ్రామ సర్పంచ్ మేడిపల్లి ప్రభాకర్రావు, సిద్ధాంతం గ్రామ సర్పంచ్ ఇస్సా కృష్ణమూర్తి గారు, RWS D.E పి.లీలకృష్ణ, RWS A.E అట్లూరి వెంకటేశ్వరరావు, ఈఓపిర్డి డి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తాసిల్దారు Ch.గోపాల్ రావు, పంచాయతీ కార్యదర్శి పి.పూర్ణచంద్రరావు, సచివాలయ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *