


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గ్రోమోర్ ఎరువుల సంస్థ గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించే భాగంలో మంగళవారం మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రము ఫంక్షన్ హాలు నందు స్కాలర్ షిన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిధి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు పేద విద్యార్థులకు అందులోను గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహించటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. వెలకట్టలేనిది విద్య అని అన్నిదానాలలో కన్నా విద్యాదానం ఎంతో మహత్తర కార్యక్రమం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరెన్నో చేయాలని కంపెనీ వారిని కోరారు. ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం నాడు-నేడు క్రింద ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దటం వాటిలో భాగంగా జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, వసతి, అమ్మఒడి లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. విద్యార్థులందరూ చదువు మీద శ్రద్ధ వహించి ప్రతిభావంతులు కావాలని కొనియాడారు. అడిషనల్ ఎస్పీ కె.జి.వి. సరిత మాట్లాడుతూ మ్రహిళల శక్తి చాలా గొప్పదని లక్ష్యాన్ని అవలీలగా సాధిస్తారని విద్య చాలా అవసరమని చిన్నతనం నుండే క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని మహిళా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాణించాలన్నారు. పోలీసు, వ్యాపార, ఇతరరంగాలలో కూడా మహిళలు రాణిస్తున్నారని కోరమాండల్ సేవలు భేష్ గా ఉన్నాయని వారు అందించే ఆర్ధిక సహాయంతో విద్యలో రాణించాలని మున్ముందు కూడా గ్రామీణ బాలికల విద్యార్థులకు ప్రత్యేక సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళలు సాధించాలనే లక్ష్యంతో అడుగు వేస్తే వందశాతం ఫలితం ఉంటుందని పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కోరమాండల్ సంస్థ గ్రామీణ బాలికలకు పెద్దపీట వేస్తుందని ఎస్ఎస్ఈ, ఇంటర్, ఉన్నత చదువులలో కూడా ప్రతిభావంతులుగా రాణించాలన్నారు. కృష్ణా జిల్లాలో 50 జడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు సంబంధించి వందలమంది బాలికలకు 9వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.5వేలు, ద్వితీయ శ్రేణి విద్యార్థులకు రూ.3500లు వంద మంది విద్యార్థులకు ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. అంతేకాక ఈ కార్యక్రమం 2006 నుంచి ప్రారంభించి నేటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 15 జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహెర సుల్తానా మాట్లాడుతూ గామీణ బాలికల విద్యను ప్రోత్సాహించడానికి కోరమాండల్ సంస్థ తీసుకున్న చొరవను అభినందిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అని కోరారు. అదే విధంగా విద్యార్థినులు అందరు బాగా చదివి భవిష్యత్తులో మంచి ఉన్నతస్థాయికి ఎదగాలి అని సూచించారు. ఈకార్యమ్రంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రీజనల్ బిజినెస్ హెడ్ కె.ఎస్.ఆర్. చక్రవర్తి, హెడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ సేల్స్ కె. సత్యనారాయణ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ యం. సచ్చిదానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News