Breaking News

నగరంలో ముడు రోజులపాటు పరిణయ ఎగ్జిబిషన్…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిణయ ఎగ్జిబిషన్ విజయవాడలో శేషసాయి కళ్యాణ మండపములో మంగళవారం  ప్రారంభించారు. ఈ  ఎగ్జిబిషన్  ముడు రోజులు మార్చి 29, 30, 31 తేదీలు ఉదయం 10 నుండి సాయంత్రం 9 గంటలవరకు అందుబాటులో ఉంటుంది.  ఇక్కడ వివిధ క్వాలిటీలలో ఏక్సక్లూజివ్ కలెక్షన్స్ అన్ని రకాల పట్టుశారీస్, లెహెంగాస్‌, బనారస్ శారీస్, ఫాన్సీ శారీస్, ప్రీమియం పట్టు శారీస్, జార్జెంట్‌, శాటిన్‌, క్రేప్‌, పింటెడ్‌, డ్రెస్సెస్, వివిధ రకాల  ఫ్యాన్సీ జ్యువలరీలు పలురకాలు దొరుకుతాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, యజమానులు  మాట్లాడుతూ మంగళవారం నుండి బందర్ రోడ్డు శేషసాయి కళ్యాణ మండపంలో మూడు రోజులు  ఎగ్జిబిషన్  ప్రారంభిస్తున్నామని నగర ప్రజలకు ఈ పరిణయ ఎగ్జిబిషన్ సుపరిచితమేనని నిర్వాహకులన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఉగాది సందర్భంగా ఉగాది వేడుకలకు, వివాహ వేడుకల సందర్భంగా  పెళ్లి కానుకలకు, యువతీ యువకులకు ,మహిళలకు అన్ని రకాల వర్గాల వారికి డిజైన్ బ్లౌజెస్, డిజైనర్ శారీస్, ఫ్యాషన్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, సమ్మర్ వస్త్రాలు,  పాదరక్షకులు వివిధ రకాల లెహంగాస్, మ్యాచింగ్ తదితర అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు. కొత్త కస్టమర్లతో పాటు మాకు పర్మినెంట్ కస్టమర్లు వున్నారన్నారు. మంచి క్వాలిటీ కలిగి అందుబాటు ధరలలో అందచేస్తామని కస్టమర్లకు మా మీద నమ్మకం వుందని అందుకే ఎప్పుడు ప్రత్యేక అమ్మకాలు పెట్టినా ఇప్పటికీ ఆదరిస్తున్నారన్నారు. లాభాపేక్ష లేకుండా కొనుగోలుదారుల అభిమానమే మూలధనంగా  క్వాలిటీ తో పాటు అందుబాటు ధరలో ఈ మూడు రోజులు  ఎగ్జిబిషన్  ఏర్పాటు చేశామని నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఈ అవకాశమును వినియోగించుకోవాలని కోరారు. వస్త్రాభిమానులకు, మహిళలకు, యువతీయువకులకు ఈ అవకాశమును వినియోగించుకోవాలన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా కొనుగోలుదారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *