Breaking News

31న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బీజేపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గోంటారన్నారు. మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ద్వారా 26లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుందని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో బీజేపీ రెండుకళ్ళ సిద్ధాంతం అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులపై వ్యతిరేకంగా మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అప్పు ఎందుకు చేసారని యువత ప్రశ్నించాలని మస్తాన్ వలి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *