Breaking News

బాబు జగ్జీవన్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్‌ నివాళి…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్‌ 5వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుడు, అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.‘‘స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.
నివాళులర్పించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్, ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ వున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *