Breaking News

ఏకగ్రీవంగా ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ నూతన కార్యవర్గ ఎన్నిక

-నూతన ఛైర్మన్ గా డాక్టర్ అలోక్ సచన్, సెక్రటరీగా డాక్టర్ యలమంచి సదాశివరావు
-వర్చువల్ విధానం ద్వారా ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులు
-ఈనెల 24న నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం
-మధుమేహ వ్యాధిపై పరిశోధనలు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్డీఐ కృషి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) రాష్ట్ర విభాగం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏపీ చాప్టర్ నూతన చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ అలోక్ సచన్, కార్యదర్శిగా విజయవాడకు చెందిన ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు ఎన్నికయ్యారు. వర్చ్యువల్ విధానంలో జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఈనెల 24న నగరంలో నిర్వహించే కార్యక్రమంలో నూతన కార్యవర్గ పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. 1972లో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్డీఐ నందు సుమారు ఏడు వేల మంది ఫిజీషియన్లు, డయాబెటాలాజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు సభ్యులుగా ఉన్నారని అన్నారు. మధుమేహవ్యాధి చికిత్సలను సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ సంస్థ తోడ్పాటునందిస్తుందని చెప్పారు. డయాబెటిస్ పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్డీఐ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో మధుమేహవ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం ద్వారా ఆర్ఎస్ఎస్డీఐ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుందని వెల్లడించారు. మధుమేహవ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, తద్వారా నియంత్రణకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని డాక్టర్ సదాశివరావు తెలియజేశారు.

ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ నూతన కార్యవర్గం
ఛైర్మన్: డాక్టర్ అలోక్ సచన్ (తిరుపతి)
ఛైర్మన్ (ఎలెక్ట్): డాక్టర్ మైథిలి (విశాఖపట్నం)
వైస్ ఛైర్మన్: డాక్టర్ కె. సాయి (రాజమండ్రి)
సెక్రటరీ: డాక్టర్ యలమంచి సదాశివరావు (విజయవాడ)
ట్రెజరర్: డాక్టర్ ఎల్. వెంకట రమణారెడ్డి (మదనపల్లి)

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు:
డాక్టర్ ఐశ్వర్య యలమంచి (విజయవాడ)
డాక్టర్ ఎస్. జయదేవ్ (విజయవాడ)
డాక్టర్ ఎం.వి. రామమోహన్ (నెల్లూరు)
డాక్టర్ మౌనిక అనిత చింతల (విశాఖపట్నం)
డాక్టర్ పి. కృష్ణ ప్రశాంతి (తిరుపతి)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *