విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియపై బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఏడి సర్వేతో కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా ఎన్టిఆర్ జిల్లాలో 16 గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతుందన్నారు. వీటిలో జగ్గయ్యపేట మండలం షెర్ మహమ్మద్పేట్ గ్రామంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన 15 గ్రామాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీటిలో కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి అయిందన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన వాటిలో 7 గ్రామాలు ఉన్నాయని వీటిలో తిరువూరు మండలంలో ఆంజనేయపురం, ముష్టికుంట్ల, చిట్యాల, గంపలగూడెం మండలంలో రాజవరం, గంపలగూడెం, వినగడప, హనుములంక గ్రామాలు. ఎల్పియంఎస్ జనరేషన్ ఉన్న వాటిలో తిరువురు మండలంలో వాముకుంట్ల, ఏ కొండూరు మండలంలో మరేపల్లి, విసన్నపేట చంద్రుపట్ల గ్రామాలు ఉన్నాయని వివిధ స్థాయిలో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News