కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతులకు మరో సువర్ణ అవకాశం ప్రియమైన ఆక్వా రైతు సోదరుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo నుంచి ఆమోదం (ఎండార్స్మెంట్ ) చేసుకొనుటకు మరో అవకాశం కల్పించిందని మత్స్య సహాయ సంచాలకులు బి.సైదా గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.
కావున ఆక్వా రైతులు, ఆక్వా భూమి కలిగిన రైతులందరికీ కూడా మత్స్యశాఖ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 (APSADA) ప్రకారం మీ దగ్గర ఉన్న అన్ని రకాల లైఫ్ టైం పర్మినెంట్ లైసెన్స్ లు కూడా ఈ చట్టం లోని కి మార్చుకోవలసి (రెన్యువల్/ఎండార్స్మెంట్ చేసుకోవాల్సి ) ఉంటుందన్నారు. కావున రైతులందరూ కూడా మీ దగ్గర ఉన్న పాత లైఫ్ టైం పర్మిషన్ సర్టిఫికెట్స్ అని కూడా ఈ చట్టంలోని ఎటువంటి రుసుము లేకుండా ఎండార్స్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఆమోదం పొందేందుకు దరఖాస్తూ చేసుకొనుటకు చివరి తేదీ ఏప్రిల్ 30( 30.04.2022) గా ఆయన తెలిపారు. కావున రైతులందరూ కూడా మీ సమీపంలోని గ్రామ మత్స్య సహాయకులను సంప్రదించవలసినదిగా కోరారు. గడుపు తేదీలోపు మీ అన్ని రకాల పర్మినెంట్ లైసెన్స్ లు ఆమోదం లేనిచో ఎకరానికి వెయ్య రూపాయలు అపరాధ రుసుముతో కొత్తగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఎండార్స్మెంట్ (ఆమోదం) చేసుకొనుటకు కావలసిన పత్రాలు:
1. పాత లైఫ్ టైం లైసెన్స్ సర్టిఫికెట్
2. చెరువు యొక్క మ్యాప్
3. ఆ చెరువులోని అందరి ఆధార్ కార్డ్స్
4. ఆ చెరువులోని అందరి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్/లేదా భూమి1 బి అడంగల్
మరిన్ని వివరాలకు కొరకు గ్రామమత్స్య సహాయకులు బి. సైదా , మత్స్య సహాయ సంచాలకులు, కొవ్వూరు: 91338 44835 నెంబర్ ను సంప్రదించ వచ్చునని తెలిపారు.
Prajavartha Online Telugu News