విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పటమట గోవిందరాజు ధర్మఈమాం ట్రస్ట్ (జిడిఇటి) నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలలో ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యామ్యాయ చూడాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పటమట గోవిందరాజు ధర్మఈమాం ట్రస్ట్(జిడిఇటి) నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలను మున్సిపల్ కార్పొరేషన్, విద్యాశాఖ అధికారులతో పరిశీలించారు. నాడు- నేడు కార్యక్రమంలో కోటి 48 లక్షల నిధులతో 14 తరగతి గదులు నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని అయితే పాఠశాల ఇప్పటికే జిప్లస్ -2 నిర్మాణంతో ఉండటం అదనపు తరగతి గదుల నిర్మాణానికి సాంకేతికంగా అనుకూలం కాదని ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి నిర్ణయించారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రత్యామ్యాయంగా సమీపంలోని నగర పాలక సంస్థ పాఠశాలలో నిర్మించే విధంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటి డిఇవో రవికుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News