Breaking News

రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా చర్యలు

-రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఈనెలాఖరుకు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. మిల్లర్లతో మాట్లాడి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అనేక మార్పులతో రైతుకు అన్ని విధాల మేలు చేకూరేలా ధాన్యం సేకరణ చేపట్టామన్నారు. ఎక్కడా కూడా మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతుకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీని సక్రమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ హరేంధిరప్రసాద్ జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ డిఎం పద్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ డిఎం వెంకట స్వామి, డిసిఓ తిరుపాల్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి రామమ్మ, సివిల్ సప్లైస్ డిప్యూటీ తాసిల్దార్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *