-అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిశానిర్దేశం
-ఎమ్మెల్యే చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఊర్మిళ నగర్లోని 223 వ అంగన్వాడీ కేంద్రంలో దాతలు ఉద్దంటి సునీత సురేష్ మరియు కాపవరపు చంద్రశేఖర్ ల సౌజన్యంతో 1వ డివిజన్ కు సంబంధించి 10 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్ లు, ఫ్యాన్ లు, కుక్కర్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సురక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, అన్ని హంగులతో వంటగది వంటి వసతులను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. రోజూ అందించే మెనూను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతి, 26వ డివిజన్ వైసీపీ ఇంఛార్జి అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావు, నాయకులు మహేశ్వర్ రెడ్డి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News