-సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్షా అధికారులకు పలు ఆదేశాలు
-త్రాగునీటి ఇబ్బందుల పరిష్కరినికి అందుబాటులో వాట్సాప్ నెం. 8181960909
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ప్రజలకు అందించు మంచినీటి సరఫరా విధానమునకు సంబంధించి రూపొందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో త్రాగునీటి సరఫరా విధానమునకు సంబందించి ఇప్పటికే చేపట్టిన మరియు చేపట్టవలసిన పనుల వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్దంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో ప్రజలకు అందించు మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి 2.7 కోట్ల వ్యయంతో 35 పనులు చెప్పట్టినట్లు వాటిలో కొత్తగా 18 పవర్ బోర్లు ఏర్పాటు చేయుటతో పాటుగా ప్రస్తుతం అందుబాటులో ఉండి పాడైన హ్యాండ్ బోర్లకు అవసరమైన మరమత్తుల పనులు చేపట్టినట్లు మరియు మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో 47 ప్రదేశాలలో చలివేoద్రముల ఏర్పాటు మరియు శివారు ప్రాంతాలకు టాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా అందించుట జరుగుతుందని కమిషనర్ గారికి వివరించారు. రక్షిత మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి చేపట్టిన అన్ని పనులు వచ్చే గురువారం నాటికీ పూర్తి చేయాలని ఆదేశిస్తూ, మంచినీటి సరఫరా పైప్ లైన్ లలో ఏమైనా లీకేజి గుర్తించిన యెడల యుద్దప్రాతిపదికన వాటిని సరిచేసి నీటి వృధా కాకుండా చూడాలని అన్నారు. ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు ఎదురైనచో నగరపాలక సంస్థ వాట్సాప్ నెం. 8181960909 కు సమాచారం అందించాలి కమిషనర్ తెలియజేసారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎస్.ఇ లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు ఇంజనీరింగ్ క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News