Breaking News

భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రపంచంలో ఆర్థిక మూలాలను అన్వేషించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం , ఏ వర్ణం వారైనా అందరూ కూడా భారతదేశపు సమాన అవకాశాలు పొందాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని, హెచ్చుతగ్గులు ఉండకూడదని, సమాన అవకాశాలు ఉండాలని, ఆశించి నిరంతరం పోరాడి ప్రతి ఒక్కరికి ఒక హక్కుగా రాజ్యాంగం ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పించి నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయనను ఒక కోణం లోనే కాకుండా ఆర్థిక కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని, ఒక దేశపు ప్రగతి , ఆర్థిక మూలాలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా అయితే సంపద సృష్టించవచ్చు అలాంటి అంశాలపైన వందలాది ఆర్టికల్స్ రాశి , భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రపంచంలో ఆర్థిక మూలాలను అన్వేషించిన గొప్ప వ్యక్తిని, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలోఈ రోజుకి కూడా వివక్ష కొనసాగుతోందని, అవకాశాలు అందరికీ అందడం లేదని అని, పాలకులు చెప్పే మాటలు అమలు చేసే విషయంలో లోపాలు ఉన్నాయని, ఈరోజు కూడా బహుజనుల పట్ల అటు వ్యాపారంలో , రాజకీయాలలో, విద్య వంటివాటిలో సమాన అవకాశాలు రావడంలేదని, బహుజనులు అంటే ఓట్లు వేసే యంత్రాలుగాను, జెండాలు మోసే కూలీలుగా అనుకుంటున్న వంటి పాలకులు కళ్లు తెరిపించాల బహుజనులు అందరూ చైతన్యవంతులు అవ్వాలని , బహుజనులు విద్యా, వ్యాపార , రాజకీయ అవకాశాలు సమానంగా పొందినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారి ఆశించిన కల నెరవేరుతుందని, జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేసే విధంగా కృషి చేశారని, మరి ఆయన ప్రజా పోరాట యాత్ర సందర్భంగా అంబేద్కర్ గారి భవనంలోనే బస చేసి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని, తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు p. దుర్గా రాణి, డివిజన్ అధ్యక్షులు పొట్నరి శ్రీనివాస రావు, నల్లబిల్లి కనకారావు, సింగ్నం శెట్టి రాము, జనసేన నాయకులు స్టాలిన్, బాదరాల శివ, బావి శెట్టి శ్రీను, బంగారు నూకరాజు, సోమీ మహేష్, చిన్నారావు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

కోమల విలాస్ సెంటర్లో…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా 52 & 53 డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు మరియు పొట్నూరీ శ్రీనివాసరావు ల ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్ వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారు పాల్గొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వాహకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు p. దుర్గా రాణి, డివిజన్ అధ్యక్షులు సింగ్నం శెట్టి రాము, జనసేన నాయకులు స్టాలిన్, మైలవరపు కొండలరావు, ఆలమూరు సాంబశివరావు,బాదరాల శివ, రేకపల్లి శ్రీను,ఆలమూరి మల్లేశ్వరరావు,బావి శెట్టి శ్రీను, బంగారు నూకరాజు, సోమీ మహేష్, చిన్నారావు, అఖిల్, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *