Breaking News

ఏపీ లో భారీగా ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశం

-కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ(బీఈఈ) వెల్లడి
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ ద్వారా కార్బన్ ఉద్గారాల తగ్గింపు పై.. టీ టీ డీ చర్యలు భేష్
-డైరెక్టర్ జనరల్ బీ ఈ ఈ
-ఇంధన సామర్ధ్య పెట్టుబడుల వల్ల ఆర్థికాభివృద్ధి , మెరుగైన ఇంధన నిర్వహణ, ఉపాధి కల్పన , మెరుగైన పర్యావరణం.
-జాతీయ కార్బన్ మార్కెట్ల పై అభిప్రాయాన్ని తెలపండి.. ఏపీ ని కోరిన బీఈఈ
-కార్బన్ మార్కెట్ తో తక్కువ వ్యయం తో పర్యావరణం పై పడే ప్రతికూల ప్రభావాలను అరికట్టవచ్చు
-పరిశ్రమలో ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశం
-ఏపీ లో 6.68 ఎంటీఓఈ ఇంధన సామర్ధ్య లక్ష్యానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏపీఎస్ఈసిఎం కు బీఈఈ సూచన
-టీటీడీలో పవిత్రమైన మహా ప్రసాదం తయారీకి క్లీన్ కుకింగ్ కు సహకరిస్తాం .. టీటీడీ కు బీఈఈ హామీ
-టీటీడీలో బీఈఈ సహకారంతో నెట్ జీరో ఎనర్జీ ఫీజిబిలిటీ స్టడీ
-టీటీడీని ప్రపంచంలో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దెందుకు సహకరిస్తాం
-డైరెక్టర్ జనరల్ , బీ ఈ ఈ , అభయ్ బాక్రే
-ఇంధన సామర్ధ్య చర్యలతో ఏటా రూ 4 నుంచి రూ 5 కోట్లు విద్యుత్ బిల్లుల ఆదాకు ప్రణాళిక
-టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , కే ఏస్ జవహర్ రెడ్డి
-టీటీడీలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఏపీఎస్ఈసిఎం
-ఇంధన సామర్ధ్య ఉపకరణాలకు టెండర్లు ఆహావ్నించిన ఎస్ఈసిఎం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఇంధన సామర్ధ్య రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే సూచించారు. దీని వల్ల పరిశ్రమలు , రవాణా, విద్యుత్ , భవన నిర్మాణం వంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్ధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడం తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగుపరచవచ్చునని తెలిపారు. అంతిమంగా ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడడమే గాక 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా దోహద పడుతుందని తెలిపారు.
రాష్ర ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం) కు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం దేశం లో కార్బన్ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని వల్ల ఇంధన సామర్ధ్య రంగంలో పెట్టుబడులు పెరగడమే గాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని పేర్కొన్నారు. దీనిలో భాగంగా నేషనల్ కార్బన్ మార్కెట్ పై బీఈఈ ఒక నమూనా మార్గదర్శిని తయారు చేసిందన్నారు. దీని పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఏపీఎస్ఈసిఎంను తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయవల్సిందిగా కోరారు.
కార్బన్ మార్కెట్ల పై పలు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని అందరికి ఉపయోగపడే రీతిలో నేషనల్ కార్బన్ మార్కెట్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని వల్ల తక్కువ వ్యయంతో పర్యావరణం పై పడే ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే గాక వివిధ కీలక రంగాల్లో అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
దేశంలో 2031 నాటికి రూ 10.02 లక్ష కోట్ల మేర ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశముందని తెలిపారు. ఇంధన సామర్ధ్య రంగం లో క్రీయాశీలకంగా వ్యవహరించే ఆంధ్ర ప్రదేశ్తో పాటు మరి కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ అవకాశాన్ని గుర్తించి తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బీఈఈ డీజీ కోరారు. జాతీయ స్థాయిలో పరిశ్రమల రంగంలో రూ 5.15 లక్షల కోట్లు , రవాణా రంగంలో రూ 2. 26 లక్షల కోట్లు , గృహ నిర్మాణ రంగంలో రూ 1. 2 లక్షల కోట్ల మేర ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశముందని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే ఎనర్జీ ఎఫిసిఎన్సీ రంగంలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని, ఇంధన సామర్ధ్య పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 2030 నాటికి 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ (ఎంటీఓఈ) ఇంధన సామర్ధ్య లక్ష్యాన్నిసాదించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించవల్సిందింగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే రాష్ట్రంలో అన్ని కీలక రంగాల్లో పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య, ఇంధన పరిరక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఇంధన సామర్ధ్య , ఇంధన పరిరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులు ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గింపు లో తీసుకున్న చర్యలకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ జవహర్ రెడ్డిని డీజీ బీఈఈ ప్రశంసించారు.అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కుకింగ్ , టీటీడీ లో ఆస్పత్రులు, భవనాలు వాటినిలో ఇంధన సామర్ధ్య చర్యల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా టీటీడీని కోరారు. టీటీడీలో పవిత్రమైన మహాప్రసాదం తాయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానం ఉపయోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చని ఆయన టీటీడీకి సూచించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందచేస్తోందని తెలిపారు. టీటీడీ సహకారంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపవల్సిందిగా ఏపీఎస్ఈసిఎంకు డీజీ సూచించారు. టీటీడీని ప్రప్రంచంలోనే అత్యుత్తమ ఇంధన సామర్ధ్య పుణ్యక్షేత్రం గా తీర్చిదిద్దెందుకు బీఈఈ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నెట్ జీరో ఎనర్జీ ఫీజిబిలిటీ స్టడీ అధ్యయనానికి టీటీడీని ఎంపిక చేసినందుకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి బీఈఈ కి కృతఙ్ఞతలు తెలిపారు. దీని వల్ల టీటీడీలో ఇంధన సామర్థ్యం పెంపొందించడం , విద్యుత్ పొదుపు , విద్యుత్ పై చేసే వ్యయంలో తగ్గుదల , కార్బన్ ఉద్గారాల తగ్గుదల వంటి ప్రయోజనాలు సమకూరడంతో పాటు అత్యుత్తమ ఇంధన సామర్ధ్య పుణ్యక్షేత్రం గా టీటీడీ అవుతుందని జవహర్ రెడ్డి వివరించారు.
టీటీడీలో ఏడాదికి 68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా , అందులో 30 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా, 70 శాతం సంప్రదాయ విద్యుత్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల కింద ఏటా రూ 40 కోట్లు టీ టీ డీ వెచ్చిస్తునట్లు తెలిపారు. ఇంధన సామర్ధ్య చర్యల ద్వారా ఇందులో రూ 4 నుంచి రూ 5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. . టీటీడీలో ఏపీఎస్ఈసీఎం నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ లో 213 నీటి పంపుసెట్ల ను పరిశీలించి, 118 ఇంధన సామర్ధ్య పంపుసెట్లను అమర్చాలని అధ్యయనం లో వెల్లడైంది. ఇంధన సామర్ధ్య పంపుసెట్లను అమర్చడం వల్ల ఏటా 4. 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా , రూ 3. 16 కోట్లు ఆదా చేయవచ్చునని అధ్యయనంలో తేలింది.
అలాగే సాంప్రదాయ ట్యూబ్ లైట్లు , ఫ్యాన్ల స్థానంలో ఇంధన సామర్ధ్య ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్లు , ఫ్యాన్లను అమర్చవల్సిందింగా సూచించటం జరిగింది. ఇందుకోసం ఇప్పటికే ఏపీఎస్ఈసిఎం టెండర్లు ఆహ్వానించడం జరింఫింది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇంధన వృదాను అరికట్టేందుకు ఎనర్జీ ఎఫిసిఎన్సీ విశేషంగా దోహదపడుతుందన్నారు . టీ టీ డీ ఇంధన సామర్ధ్య చర్యలతో పాటు , జలవనరుల సమర్ధ నిర్వహణ లో కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు . సరాసరి రోజుకు టీ టీ డీ లో 34 లక్షల గెలన్ల నీటిని వినియోగించుతుండగా , ఇప్పుడు అది 44 లక్షల గెలన్లకు చేరిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *